రాజమౌళి సినిమా గురించి మరో లీక్ ఇచ్చిన విజయేంద్ర ప్రసాద్🎞️🎤
- Suresh D
- Aug 24, 2023
- 1 min read
ఆర్ఆర్ఆర్ అఖండ విజయం తర్వాత దిగ్గజ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి సూపర్ స్టార్ మహేష్ బాబుతో సినిమా ప్రకటించారు. దీన్ని హాలీవుడ్ స్థాయిలో తెరకెక్కించనున్నారు. అందుకు తగ్గట్టుగా రాజమౌళి తండ్రి, స్టార్ రైటర్ విజయేంద్ర ప్రసాద్ కథను సిద్ధం చేశారు. ఈ ప్రాజెక్టు గురించి తాజాగా ఆయన ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు వెల్లడించారు. ఇది ఆఫ్రికన్ అడ్వెంచర్ ఫిల్మ్ అని చెప్పారు. అలాగే ఈ సినిమాలో హాలీవుడ్ నటులను తీసుకునే అవకాశం కూడా ఉందని చెప్పారు.కాగా, ఈ చిత్రం ఈ ఏడాది చివర్లో మొదలయ్యే అవకాశం ఉంది. వచ్చే ఏడాది సెట్స్ మీదకు వెళ్తుందని సమాచారం. 2025లో ప్రేక్షకుల ముందుకు వచ్చేలా ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది.












































