హైదరాబాద్‌లో ‘గేమ్ ఛేంజర్’ టీమ్.. ప్రైవేట్ స్టూడియోలో కీలక సన్నివేశాల చిత్రీకరణ🎥💫
- Suresh D
- Aug 24, 2023
- 1 min read
ఆర్ఆర్ఆర్ చిత్రం తర్వాత ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న చిత్రం ’గేమ్ ఛేంజర్’. దిగ్గజ దర్శకుడు శంకర్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. భారీ బడ్జెట్‌తో ప్యాన్ ఇండియా స్థాయిలో దిల్‌రాజు నిర్మిస్తున్నారు. బాలీవుడ్ నటి కియారా అద్వానీ హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రం షూటింగ్ ఆలస్యం అవుతూ వస్తోంది. ఇటీవలే సినిమా యాక్షన్ సీక్వెన్స్‌ను పూర్తి చేశారు. తాజాగా హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ స్టూడియోలో చిత్రీకరణ తిరిగి ప్రారంభమైంది. రాజకీయ నేపథ్యంతో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రామ్‌చరణ్ రెండు పాత్రల్లో కనిపించనున్నారు. శ్రీకాంత్, ఎస్. జే సూర్య, అంజలి, సునీల్ కీలకపాత్రలు పోషిస్తున్నారు. ఎస్. థమన్ సంగీతం అందిస్తున్నాడు. 🎥💫
