మూవీ లవర్స్‌కు గుడ్ న్యూస్ .. ఆ ప్రముఖ ఓటీటీ లో రెండు రోజుల పాటు సినిమాలన్నీ ఫ్రీ..📢🏠🎥
- Suresh D
- Aug 23, 2023
- 1 min read
Updated: Aug 24, 2023
ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో భాగంగా వివిధ ఓటీటీ సంస్థలు కొత్త కంటెంట్‌ను అందుబాటులోకి తెస్తున్నాయి. అలాగే పండుగలు, ప్రత్యేక సందర్భాల్లోనూ కొత్త ఆఫర్లను ప్రకటిస్తున్నాయి. అంటే ఎలాంటి సబ్ స్క్రిప్షన్ ఛార్జీలు చెల్లించకుండానే సినిమాలు, వెబ్ సిరీస్‌లను చూసేయచ్చన్నమాట.

ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో భాగంగా వివిధ ఓటీటీ సంస్థలు కొత్త కంటెంట్‌ను అందుబాటులోకి తెస్తున్నాయి. అలాగే పండుగలు, ప్రత్యేక సందర్భాల్లోనూ కొత్త ఆఫర్లను ప్రకటిస్తున్నాయి. అంటే ఎలాంటి సబ్ స్క్రిప్షన్ ఛార్జీలు చెల్లించకుండానే సినిమాలు, వెబ్ సిరీస్‌లను చూసేయచ్చన్నమాట. తాజాగా మరో ప్రముఖ ఓటీటీ సంస్థ ఇలాంటి బంపర్ ఆఫర్‌తో మన ముందుకు వచ్చింది. డిజిటల్ స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్ కు చెందిన ఈటీవీ విన్ రెండు రోజుల పాటు తమ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్‌లో ఉన్న మొత్తం కంటెంట్ ను ఉచితంగా చూసేయచ్చని ప్రకటించింది. వాచ్ పార్టీ పేరుతో ఈ ఆఫర్‌ను ప్రకటించిన ఈటీవీ విన్.. ఆగస్టు 26, 27 తేదీల్లో తమ సినిమాలు, షోలన్నీ ఉచితంగా చూడవచ్చని తెలిపింది. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ఒక పోస్ట్ షేర్ చేసింది. ‘మీ అందరి కోసం ఎంతో ఉత్సాహవంతమైన అనౌన్స్‌మెంట్. ‘వాచ్ పార్టీ’ పేరుతో ఈటీవీ విన్ అద్భుతమైన ఆఫర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈటీవీ విన్‌లో ఉన్న సినిమాలు, షోలను ఆగస్టు 26, 27 తేదీల్లో మొత్తం రెండు రెండు రోజుల పాటు సినిమాలు, షోలను ఫ్రీగా చూసేయండి. అని తమ ప్రకటనలో పేర్కొంది. 📢🎥