top of page

భారత్‌కు అభినందనలు.. మేం సిగ్గుతో తల దించుకుంటున్నాం..

చంద్రయాన్‌ 3 విజయాన్ని పురస్కరించుకుని ప్రపంచం నలుమూలల నుంచి ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. పలు దేశాల అధిపతులు, అధ్యక్షులు భారత్‌కు, ఇస్రోకు అభినందనలు తెలుపుతున్నారు.

ree

చంద్రయాన్‌ 3 విజయాన్ని పురస్కరించుకుని ప్రపంచం నలుమూలల నుంచి ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. పలు దేశాల అధిపతులు, అధ్యక్షులు భారత్‌కు, ఇస్రోకు అభినందనలు తెలుపుతున్నారు. ఈక్రమంలో పాకిస్తాన్‌కు చెందిన ప్రముఖ నటి సెహర్‌ షిన్వారీ కూడా చంద్రయాన్‌ 3 సక్సెస్‌ పై స్పందించింది. సోషల్‌ మీడియా వేదికగా భారత్‌కు అభినందనలు తెలిపింది. ‘భారత్‌లో శత్రుత్వాన్ని పక్కన పెడితే ఇస్రోను అభినందించాల్సిందే. సైన్స్ అండ్‌ టెక్నాలజీ పరంగా భారత్ ఎంతో ఎత్తుకు ఎదిగింది. ఈ ఘనతను అందుకోవడానికి పాకిస్తాన్‌కు మరో 2,3 దశాబ్దాలు పడుతుంది. భారత్‌ ఎంత ఎత్తుకు ఎదిగిందో సిగ్గుతో తలదించుకోవాల్సి వస్తోంది. దురదృష్టవశాత్తు ఈ రోజు మన దుస్థితికి మనం తప్ప మరెవరూ కాదు. అన్న విషయాన్ని పాకిస్తాన్ ప్రజలు దృష్టిలో ఉంచుకోవాలి’ అని పాక్‌ నటి సొంత దేశంపైనే సెటైర్లు వేసింది.


 
 
bottom of page