top of page

అక్టోబర్ 26న రాష్ట్రానికి అమిత్ షా.. త్వరలోనే బీజేపీ రెండో జాబితా.. 🗳️💬

తెలంగాణలో అధికారమే లక్ష్యంగా భారతీయ జనతా పార్టీ వ్యూహాలకు పదునుపెడుతోంది. స్వయంగా భారత ప్రధాని నరేంద్ర మోదీ రంగంలోకి దిగి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. ఆ తర్వాత.. తెలంగాణకు బీజేపీ అగ్రనేతలు ఒక్కొక్కరిగా క్యూ కడుతున్నారు.

ree

తెలంగాణలో అధికారమే లక్ష్యంగా భారతీయ జనతా పార్టీ వ్యూహాలకు పదునుపెడుతోంది. స్వయంగా భారత ప్రధాని నరేంద్ర మోదీ రంగంలోకి దిగి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. ఆ తర్వాత.. తెలంగాణకు బీజేపీ అగ్రనేతలు ఒక్కొక్కరిగా క్యూ కడుతున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా.. హోంమంత్రి అమిత్ షా అక్టోబర్ 26 గురువారం రాత్రి హైదరాబాద్‌కు రానున్నారు. అక్టోబర్ 27న నేషనల్‌ పోలీస్‌ అకాడమీలో జరిగే ఐపీఎస్ అధికారుల పాసింగ్‌ అవుట్‌ పరేడ్‌లో పాల్గొంటారు. అదే రోజు మధ్యాహ్నం సూర్యాపేట జిల్లా కేంద్రంలో నిర్వహించే బీజేపీ ఎన్నికల ప్రచార సభకు హాజరవుతారు. నూతన వ్యవసాయ మార్కెట్‌ సమీపంలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో అమిత్‌ షా పాల్గొంటారని బీజేపీ నేతలు తెలిపారు. ఇక హైదరాబాద్‌ పర్యటనలో భాగంగా పార్టీ ముఖ్య నేతలతో అమిత్ షా భేటీ కానున్నారు. ఎన్నికల కార్యాచరణ, ప్రచార సరళిపై ప్రధానంగా స్థానిక నేతలతో చర్చిస్తారు అమిత్ షా.🗳️💬

ఇక టూర్ల వ్యవహారం పక్కన పెడితే బీజేపీలో జరుగుతున్న రెండో యాక్టివిటీ అభ్యర్థుల జాబితాపై కసరత్తు, అసంతృప్తుల బుజ్జగింపులు. తొలి జాబితా తర్వాత రోజురోజుకీ పెరుగుతున్న అసంతృప్తుల లిస్ట్ పెరుగుతోంది. ఈ నేపథ్యంలో అసంతృప్త నేతలతో విడివిడిగా భేటీ కాబోతున్నారు అమిత్ షా. మరోవైపు ఉమ్మడి నల్గొండ జిల్లాలో సభ పెట్టడంతో ప్రతిపక్ష పార్టీల్లో టెన్షన్‌ మొదలైంది. రాజగోపాల్‌రెడ్డి.. బీజేపీలో ఉంటారో లేదోనన్న ఆందోళన కనిపిస్తోంది.

మరోవైపు అభ్యర్థుల ఎంపికపై ఆచితూచి వ్యవహరించాలని బీజేపీ అధిష్టానం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో నవంబరు ఒకటో తేదీ ఆ తర్వాతే మిగిలిన అభ్యర్థుల ప్రకటన ఉంటుందని సమాచారం. నవంబరు 1వ తేదీన బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశం జరగనుంది. అదే రోజు లేదా నవంబరు 2న రెండో జాబితాను ప్రకటిస్తారని పార్టీ వర్గాల ద్వారా తెలుస్తోంది. రాష్ట్రంలోని 119 అసెంబ్లీ స్థానాలకుగాను బీజేపీ ఇప్పటికే 52 నియోజకవర్గాలకు అభ్యర్థులను పార్టీ ప్రకటించింది. మిగిలిన వాటిలో అత్యధిక స్థానాల అభ్యర్థులపై రెండు, మూడు రోజుల్లో స్పష్టత వస్తుందని భావిస్తున్నారు.🗳️💬

 
 
bottom of page