బంగ్లాదేశ్ ను చిత్తుగా ఓడించిన సౌతాఫ్రికా.. రెండో స్థానానికి సఫారీలు..🏏🎉
- Suresh D
- Oct 25, 2023
- 1 min read
2023 ప్రపంచకప్ 23వ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా జట్టు ఘన విజయం సాధించింది. 383 పరుగుల లక్ష్యాన్ని ఛేదించలేకపోయిన బంగ్లాదేశ్ టీం 46.4 ఓవర్లకు 233 పరుగులకు ఆలౌట్ అయింది.

2023 ప్రపంచకప్ 23వ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా జట్టు ఘన విజయం సాధించింది. 383 పరుగుల లక్ష్యాన్ని ఛేదించలేకపోయిన బంగ్లాదేశ్ టీం 46.4 ఓవర్లకు 233 పరుగులకు ఆలౌట్ అయింది. ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో 149 పరుగుల తేడాతో విజయం సాధించిన సౌతాఫ్రికా, పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి చేరుకుంది. అంతకుముందు న్యూజిలాండ్ రెండో స్థానంలో నిలిచింది. ఇరుజట్లకు 8 పాయింట్లు ఉన్నాయి. అయితే, సౌతాఫ్రికాకు రన్ రేట్ అధికంగా ఉండడంతో రెండో స్థానంలో నిలిచింది. కాగా, టీమిండియా 10 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచింది. తొలి 10 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయిన బంగ్లాదేశ్ ఇన్నింగ్స్‌ను మహ్మదుల్లా రియాద్ ముందుకు తీసుకెళ్లాడు. తర్వాత 20 ఓవర్లలో జట్టు స్కోరు 90 పరుగులకు చేరింది. కానీ వికెట్లు కోల్పోలేదు. అయితే, లిటన్ దాస్ 22 పరుగులు, మెహదీ హసన్ మిరాజ్ 11, నసుమ్ అహ్మద్ 19 పరుగులు చేసి ఔట్ అయ్యారు. కగిసో రబాడ, కేశవ్ మహరాజ్, గెరాల్డ్ కూటీలకు తలో వికెట్ దక్కింది.🏏🎉









































