top of page

🌟 ఈ రాశివారు ముఖ్యమైన విషయాలను ఇతరులతో చర్చించవద్దు🌟

తెలుగురాశి ఫలితములు (దిన ఫలితము) 25. 10.2023, వారం: బుధవారం, తిథి : ఏకాదశి, నక్షత్రం : శతభిషం, మాసం : ఆశ్వయుజం, సంవత్సరం: శోభకృత్‌ నామ, అయనం: దక్షిణాయనం. మీ రాశి ఫలితం ఇక్కడ చూసుకోవచ్చు.🌌🔮

ree

మేష రాశి

మేష రాశి వారికి ఈ రోజు మీకు అన్ని విధాలుగా కలసివచ్చును. ఉద్యోగంలో మంచి ఫలితాలుంటాయి. అనుకున్న స్థాయికి చేరతారు. మీవల్ల చాలామందికి లబ్ధి కలుగుతుంది. మిత్రుల సహాయంతో నూతన ప్రయత్నాలు ఫలిస్తాయి. వ్యాపారం బాగుంటుంది. పోయినవి తిరిగి లభిస్తాయి. గతంలో ఆగిపోయిన పనులు ఇప్పుడు పూర్తవుతాయి. కాలాన్ని సద్వినియోగం చేసుకోండి. విఘ్నేశ్వరుని పూజించడం, సంకటనాశన గణపతి స్తోత్రాన్ని పఠించడం, విఘ్నేశ్వర అష్టోత్తర శతనామావళి పఠించడం వంటివి చేయాలి. ఈరోజు వినాయకుడికి అరటిపళ్ళు, కొబ్బరికాయ నివేదించడం, బెల్లమును నైవేద్యముగా సమర్చించడం వలన విఘ్నాలు తొలగి శుభఫలితాలు కలుగుతాయి.

వృషభ రాశి

వృషభ రాశి వారికి ఈరోజు మీకు మధ్యస్థ ఫలితాలున్నాయి. ధర్మమార్గంలో లక్ష్యాలను పూర్తి చేయండి. ధైర్యంగా ముందుకు సాగండి. ఆర్థికస్థితి మెరుగవుతుంది. సహకారం లభిస్తుంది. కుటుంబ సభ్యుల సహకారంతో సమస్యలు తొలగుతాయి. దేనికీ సంకోచించవద్దు. ఉద్యోగంలో మధ్యస్థ ఫలితాలుంటాయి. భగవద్గీత వినడం, చదవడం వల్ల, కృష్ణాష్టకం పఠించడం వలన శుభఫలితాలు కలుగుతాయి. పాలతో చేసినటువంటి ప్రసాదాల్ని శ్రీకృష్ణునికి నైవేద్యముగా సమర్పించాలి.

మిథున రాశి

మిథున రాశి వారికి ఈ రోజు మీకు వ్యాపారపరంగా కలసివస్తుంది. మంచి లాభాలుంటాయి. ప్రారంభించిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఆర్థికంగా కలసివస్తుంది. ముఖ్యమైన విషయాలను ఇతరులతో చర్చించవద్దు. భూ గృహ వాహనాది యోగాలు అనుకూలిస్తాయి. ఆర్థికంగా బాగా కలసివస్తుంది. విష్ణు సహస్రనామపారాయణ చేయడం, విష్ణుమూర్తికి సంబంధించిన ఆలయాల్లో అర్చన వంటివి చేయించుకోవడం అలాగే ఆలయదర్శనం చేసుకోవడం వల్ల శుభఫలితాలు కలుగుతాయి. మహావిష్ణువు యొక్క అష్టోత్తర శతనామావళి పఠించండి.

కర్కాటక రాశి

కర్కాటక రాశి వారికి ఈ రోజు మీకు మధ్యస్థ ఫలితాలున్నాయి. కొత్త బాధ్యతలు స్వీకరిస్తారు. నూతన ప్రయత్నాలు ఫలిస్తాయి. విశేష ధనలాభాలు వచ్చే సూచన. వ్యాపారంలో జాగ్రత్తతో వ్యవహరించాలి. ఇతరులపై ఆధారపడవద్దు. మాయమాటలతో మోసం చేసే వారితో జాగ్రత్త. వెంకటేశ్వరస్వామిని పూజించాలి. వెంకటేశ్వరస్వామి అష్టోత్తర శతనామావళి పఠించండి. శ్రీ వెంకటేశ్వర సుప్రభాతం చదవడం వినడం వల్ల శుభఫలితాలు కలుగుతాయి.

సింహ రాశి

సింహ రాశి వారికి ఈ రోజు మీకు అనుకూల ఫలితాలున్నాయి. విశేషమైన ప్రయత్నం చేయండి, అనుకున్నది సాధిస్తారు. ఎదురుచూస్తున్న కార్యాలు ఇప్పుడు విజయాన్నిస్తాయి. ప్రతి పనిలోనూ మీదే పైచేయిగా ఉంటుంది. ఆత్మవిశ్వాసంతో ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. గృహ నిర్మాణాది బాధ్యతలు పూర్తిచేస్తారు. వినాయకుడిని పూజించడం, సంకటనాశన గణపతి స్తోత్రాన్ని పఠించడం, గణపతి అష్టోత్తర శతనామావళి పఠించడం వంటివి చేయడం వలన మరింత శుభఫలితాలు కలుగుతాయి.

కన్యా రాశి

కన్యా రాశి వారికి ఈ రోజు మీకు మధ్యస్థ ఫలితాలున్నాయి. గ్రహదోషం ఉన్నందువలన అడుగడుగునా విఘ్నాలు ఎదురవుతాయి. ముఖ్యకార్యాలో అప్రమత్తంగా ఉండాలి. ఇతరులపై ఆధారపడవద్దు. సొంత నిర్ణయాలు విజయాన్నిస్తాయి. ప్రయాణాల్లో సమస్యలు ఎదురవుతాయి. పట్టుదలగా పనిచేస్తే విజయం లభిస్తుంది. శ్రీకృష్ణుడిని పూజించాలి. కృష్ణాష్టకం పఠించాలి. పాలతో చేసినటువంటి ప్రసాదాల్ని శ్రీకృష్ణునికి నైవేద్యముగా సమర్పించాలి. భగవద్గీత వినడం చదవడం వల్ల శుభఫలితాలు కలుగుతాయి.

తులా రాశి

తులా రాశి వారికి ఈ రోజు మీకు మధ్యస్థ ఫలితాలున్నాయి. బాధ్యతాయుతమైన ప్రవర్తనతో నలుగురికీ ఆదర్శంగా ఉంటారు. అవకాశాల్ని అదృష్టంగా మార్చుకోవాలి. చెడు ఊహించవద్దు. బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించాలి. పనుల్ని సకాలంలో పూర్తి చేయాలి. వ్యాపారంలో సొంత నిర్ణయాలు మంచిది. ఎవరితోనూ వివాదాలకు దిగవద్దు. విష్ణు సహస్రనామపారాయణ చేయడం, విష్ణుమూర్తికి సంబంధించిన ఆలయాల్లో అర్చన వంటివి చేయించుకోవడం అలాగే ఆలయ దర్శనం చేసుకోవడం వల్ల శుభఫలితాలు కలుగుతాయి. మహావిష్ణువు యొక్క అష్టోత్తర శతనామావళి పఠించండి.

వృశ్చిక రాశి

వృశ్చిక రాశి వారికి ఈరోజు మీకు మధ్యస్థంగా ఉన్నది. వ్యాపారంలో శుభఫలితాలున్నాయి. ఉద్యోగంలో ఆశించిన ఫలితం వెంటనే లభిస్తుంది. బుద్ధిబలంతో పనిచేసి పెద్దల్ని మెప్పించండి. పదవీలాభం ఉంటుంది. పలుమార్గాల్లో వ్యాపారం అభివృద్ధి చెందుతుంది. ఆవేశపూరిత నిర్ణయాలు పనికిరావు. స్పష్టంగా మాట్లాడండి. మిత్రులవల్ల కార్యసిద్ధి లభిస్తుంది. వెంకటేశ్వరస్వామి యొక్క అష్టోత్తర శతనామావళి పఠించండి. శ్రీ వెంకటేశ్వర సుప్రభాతం చదవడం వినడం వల్ల శుభఫలితాలు కలుగుతాయి.

ధనూ రాశి

ధనూ రాశి వారికి ఈరోజు మీకు అనుకూల ఫలితాలు ఉన్నాయి. వ్యాపారంలో పెట్టుబడులు లాభాన్నిస్తాయి. అద్భష్టవంతులవుతారు. జీవితాశయాల్లో ఒకటి నెరవేరుతుంది. పలుమార్గాల్లో అభివృద్ధిని సాధించే సమయం ఇది. ఎటుచూసినా ఉత్తమ ఫలితాలే కనిపిస్తాయి. ఉద్యోగంలో అనుకున్నది సాధిస్తారు. పదోన్నతులుంటాయి. వినాయకుని పూజించడం, సంకటనాశన గణపతి స్తోత్రాన్ని పఠించడం, వినాయక అష్టోత్తర శతనామావళి పఠించడం వంటివి చేయడం వలన మరింత శుభఫలితాలు కలుగుతాయి.

మకర రాశి

మకర రాశి వారికి ఈరోజు మీకు మధ్యస్థ ఫలితాలున్నాయి. ఉద్యోగంలో ఏకాగ్రతతో బాధ్యతలను నిర్వర్తించాలి. సమస్యలు తొలగుతాయి. అపార్థాలకు తావు లేకుండా సంభాషించాలి. అధికారులు ప్రసన్నులవుతారు. ధనయోగమున్నది. ధైర్యంగా నిర్ణయాలు తీసుకుని అమలుచేస్తే కలిసివస్తుంది. కుటుంబ సభ్యుల సలహాతో ఆపదలు తొలగుతాయి. పాలతో చేసినటువంటి ప్రసాదాల్ని శ్రీకృష్ణునికి నైవేద్యముగా సమర్పించాలి. భగవద్గీత వినడం చదవడం వల్ల శుభఫలితాలు కలుగుతాయి.

కుంభ రాశి

కుంభ రాశి వారికి ఈరోజు అనుకూలంగా లేదు. బుద్ధిబలంతో విఘ్నాలను జయించండి. వ్యాపారంలో సమయస్ఫూర్తి అవసరం. నిజాయితీ మిమ్మల్ని కాపాడుతుంది. ఎప్పటి పనులు అప్పుడే పూర్తిచేస్తే అనుకున్నది సాధిస్తారు. ముఖ్యకార్యాల్లో శ్రద్ధ పెట్టండి. విష్ణు సహస్రనామపారాయణ చేయడం, విష్ణుమూర్తికి సంబంధించిన ఆలయాల్లో అర్చన వంటివి చేయించుకోవడం అలాగే ఆలయదర్శనం చేసుకోవడం వల్ల శుభఫలితాలు కలుగుతాయి. మహావిష్ణువు యొక్క అష్టోత్తర శతనామావళి పఠించండి.

మీన రాశి

మీన రాశి వారికి ఈ రోజు మీకు అనుకూలంగా లేదు. ఎన్ని ఆటంకాలున్నా సకాలంలో పనులు పూర్తిచేయండి. దేనికీ వెనకాడవద్దు. చెడు ఆలోచించకూడదు. నూతన ప్రయత్నాలకు సమయం కాదు. ఇతరులపై ఆధారపడవద్దు. నిరాశపడవద్దు. మనోబలంతో పనులు ప్రారంభించాలి. వెంకటేశ్వరస్వామిని పూజించాలి. వెంకటేశ్వరస్వామి యొక్క అష్టోత్తర శతనామావళి పఠించండి. శ్రీ వెంకటేశ్వర సుప్రభాతం చదవడం వినడం వల్ల శుభఫలితాలు కలుగుతాయి.

 
 
bottom of page