top of page

🎬 టామ్ క్రూజ్ మిషన్ ఇంపాజిబుల్ 7 ఓటీటీలోకి వచ్చేది అప్పుడే?

హలీవుడ్ టాప్ హీరో టామ్ క్రూజ్ నటించిన లేటెస్ట్ చిత్రం 'మిషన్ ఇంపాజిబుల్ 7'. ఈ సినిమా వరల్డ్ వైడ్ గా జూలై 12న రిలీజ్ కానుంది. మనదేశంలో ఈ మూవీని ఇంగ్లీష్, హిందీ, తమిళం మరియు తెలుగు భాషలలో విడుదల చేయనున్నారు.

హలీవుడ్ టాప్ హీరో టామ్ క్రూజ్ నటించిన లేటెస్ట్ చిత్రం 'మిషన్ ఇంపాజిబుల్ 7'. ఈ సినిమా వరల్డ్ వైడ్ గా జూలై 12న రిలీజ్ కానుంది. మనదేశంలో ఈ మూవీని ఇంగ్లీష్, హిందీ, తమిళం మరియు తెలుగు భాషలలో విడుదల చేయనున్నారు. ఈ చిత్రంలో హేలీ అట్వెల్, వింగ్ రేమ్స్ కీలకపాత్రల్లో నటించారు. ఈ సినిమా రన్ టైమ్ 2 గంటల 44 నిమిషాలు. ఈ సినిమాను భారత్ లో దాదాపు 2 వేల థియేటర్లలో రిలీజ్ చేయనున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్స్ ను రెండు వారాల ముందే ప్రారంభించారు. టికెట్ అమ్మకాలు కూడా బాగానే జరిగాయి. ఈ నేపథ్యంలో చాలా మంది మూవీ లవర్స్కి ఇది ఏ ఓటీటీలోకి వస్తుంది, ఎప్పుడు డిజిటల్ స్ట్రీమింగ్ చేస్తారా అని నెట్టింట తెగ సెర్చ్ చేస్తున్నారు. అయితే MI7 యొక్క ఓటీటీ రిలీజ్ డేట్ ను మేకర్స్ ఇంకా ఎనౌన్స్ చేయలేదు. అయితే ఈ చిత్రాన్ని మార్చి 2024లో ఓటీటీ రిలీజ్ చేసే అవకాశం ఉందని ఊహగానాలు వినిపిస్తున్నాయి. అంటే ఈ మూవీ ఓటీటీలోకి రావాలంటే దాదాపు 8-9 నెలల సమయం పడుతుందన్న మాట. అయితే ఈ మూవీ స్ట్రీమింగ్ రైట్స్ ను పొందేందుకు నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వీడియో మరియు డిస్నీ+ హాట్‌స్టార్ పోటీపడుతున్నాయట.


 
 
bottom of page