కలకలం రేపుతోన్న నకిలీ కరెన్సీ నోట్లు.. 8 మంది అరెస్ట్🚔
- Suresh D
- Jul 11, 2023
- 1 min read
ఉమ్మడి కర్నూల్ జిల్లాలో నకిలీ కరెన్సీలు బయటపడటం కలకలం రేపుతోంది. ఇప్పటికే భారీ ఎత్తున నకిలీ కరెన్సీ సిజ్ అవుతుండటం, పలువురు అరెస్ట్ అవుతుండటం ఇందుకు ఉదాహరణగా చెప్తున్నారు. మరో విషయం ఏంటంటే అరెస్టయిన వారిలో పోలీసులు కూడా ఉండటం మరింత విస్మయానికి గురిచేస్తోంది.

ఉమ్మడి కర్నూల్ జిల్లాలో నకిలీ కరెన్సీలు బయటపడటం కలకలం రేపుతోంది. ఇప్పటికే భారీ ఎత్తున నకిలీ కరెన్సీ సిజ్ అవుతుండటం, పలువురు అరెస్ట్ అవుతుండటం ఇందుకు ఉదాహరణగా చెప్తున్నారు. మరో విషయం ఏంటంటే అరెస్టయిన వారిలో పోలీసులు కూడా ఉండటం మరింత విస్మయానికి గురిచేస్తోంది. ఒరిజినల్ కరెన్సీ నోట్లకు మూడు రెట్లు అదనంగా నకిలీ కరెన్సీ ఇస్తామని నమ్మబలుకుతున్నారని జిల్లా వాసులు ఆందోళనకు గురవుతున్న పరిస్థితి నెలకొంది. ఇక వివరాల్లోకి వెళ్తే కర్నూలు జిల్లా ఆస్పరి పోలీస్ స్టేషన్లో విజయ్ కుమార్ అనే హెడ్ కానిస్టేబుల్ 2009 నుంచి పనిచేస్తున్నారు. దీంతో ఆ పోలీస్ స్టేషన్ పరిధిలో విజయ్ కుమార్‌కి విస్తృతంగా పరిచయాలు ఏర్పడ్డాయి. దీంతోపాటు సులభంగా డబ్బులు సంపాదించేందుకు అతను అక్రమ మార్గాలు ఎంచుకున్నాడు. అత్యంత నేరమయమైన నకిలీ కరెన్సీని చలామణి చేయాలని అనుకున్నాడు.అందులో భాగంగానే కారుమంచి గ్రామానికి చెందిన ఆంజనేయ అనే వ్యక్తి దగ్గర పరిచయాలు పెంచుకున్నాడు. 10 లక్షలు ఒరిజినల్ కరెన్సీ ఇస్తే 30 లక్షలు నకిలీ కరెన్సీ నోట్లు ఇస్తానని నమ్మ పలికాడు. అనుకున్నట్టుగానే ఆంజనేయ నుంచి నాలుగు లక్షల 80,000 ఒరిజినల్ కరెన్సీని తీసుకున్నాడు. దీనికి అదనంగా మొత్తం 15 లక్షల రూపాయల విలువైన నకిలి కరెన్సీ నోట్లు ఇస్తానని చెప్పారు విజయ్ కుమార్. కానిస్టేబుల్‌ను నమ్మిన ఆంజనేయ చెప్పిన మాట ప్రకారం ఒరిజినల్ కరెన్సీ ఇచ్చాడు. కానీ కానిస్టేబుల్ విజయకుమార్ మాత్రం ఫేక్ కరెన్సీ ఇవ్వలేకపోయారు. ఇక చేసేదేమి లేక ఆంజనేయ పోలీసులకి ఫిర్యాదు చేశాడు. దీంతో గుట్టు కాస్త రట్టు అయ్యింది. విషయం ఎస్పీ వరకు వెళ్లడంతో వెంటనే కానిస్టేబుల్ విజయ్ కుమార్‌ని వీఆర్కు పిలిపించారు. అంతేకాకుండా ఆదోని డీఎస్పీని విచారణకు ఆదేశించారు. ప్రాథమికంగా విచారించిన ఆదోని డీఎస్సీ శివ నారాయణస్వామి నిజమే అని నివేదిక ఇచ్చారు దీంతో విజయ్ కుమార్ను సస్పెండ్ చేశారు.దాదాపు కోటి రూపాయలకు పైగా విలువచేసే నకిలీ కరెన్సీని సీజ్ చేసి.. 8 మందిని అరెస్టు చేశారు. దీనిపై పోలీసులు ఇంకా కూపీ లాగుతున్నారు.💸🚔