top of page

భోళా శంకర్ సినిమా నుంచి రెండో పాట వచ్చేసింది..

మెగాస్టార్ చిరంజీవి వరుస సినిమాలను లైనప్ చేసి ఆయా షూటింగ్స్ తో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం నటిస్తున్న మూవీ భోళాశంకర్. ఈ సినిమాకు మెహర్ రమేష్ దర్శకత్వం వహిస్తున్నారు.

మెగాస్టార్ చిరంజీవి వరుస సినిమాలను లైనప్ చేసి ఆయా షూటింగ్స్ తో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం నటిస్తున్న మూవీ భోళాశంకర్. ఈ సినిమాకు మెహర్ రమేష్ దర్శకత్వం వహిస్తున్నారు. తమిళ్ లో సూపర్ హిట్ గా నిలిచిన వేదాళం సినిమాకు రీమేక్ గా ఈ సినిమాను తెరకెక్కుస్తున్నారు. తమిళ్ లో అజిత్ హీరోగా నటించిన ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. ఈ సినిమాలో మెగాస్టార్ సరసన తమన్నా హీరోయిన్ గా నటిస్తుంది. అలాగే చిరు చెల్లెలిగా అందాల భామ కీర్తిసురేష్ నటిస్తుంది .ఈ మూవీ నుంచి ఇప్పటికే విడుదలైన ఫస్ట్ సాంగ్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇక ఇప్పుడు భోళాశంకర్ మూవీ నుంచి సెకండ్ సాంగ్ ను రిలీజ్ చేశారు. ఇది ఓ పార్టీ సాంగ్. ఈసాంగ్ లో మెగాస్టార్ తో పాటు అక్కినేని హీరో సుశాంత్ హీరోయిన్లు తమన్నా, కీర్తిసురేష్ కూడా కనిపించారు.కాసర్ల శ్యామ్ సాహిత్యం అందించిన ఈ పాటను అనురాగ్ కులకర్ణి, మంగ్లీ కలిసి ఆలపించారు. ప్రముఖ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ ఈ పాటకు కొరియో గ్రాఫ్ చేశారు. మహతి స్వర సాగర్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. ఆగస్టు 11న వరల్డ్ వైడ్ గా ఈ మూవీని రిలీజ్ చేయనున్నారు.


 
 
bottom of page