‘ఫోన్ పే’లో మహేశ్ బాబు.. ఇకపై డబ్బులేస్తే సూపర్ స్టార్ స్వీట్ వాయిస్ వినొచ్చు📱🌟
- Suresh D
- Feb 21, 2024
- 1 min read
తాజాగా మరో ప్రముఖ సంస్థకు బ్రాండ్ అంబాసిడర్ గా మారిపోయారు మహేశ్ బాబు. డిజిటల్ మనీ ట్రాన్సఫర్ యాప్, ఫోన్ పేకు తన గొంతును అరువుగా ఇచ్చేశారీ సూపర్ స్టార్.
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబుకు ఉన్న క్రేజ్, పాపులారిటీ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆయనతో సినిమాలు చేసేందుకు నిర్మాతలు ఎలా పోటీ పడతారో తనతో యాడ్స్, ప్రకటనలు చేసేందుకు కంపెనీలు కూడా అలాగే క్యూ కడతాయి. అప్పుడప్పుడు మహేశ్ చేసే కొన్ని కమర్షియల్ యాడ్స్ అండ్ ప్రమోషన్స్ పై విమర్శలు వస్తున్నాయి. అయితే ఆ సంపాదనతోనే ఒక ఊరును దత్తత తీసుకున్నాడు. పేదలు, చిన్న పిల్లల గుండె శస్త్రచికిత్సల కోసం వెచ్చిస్తూ తన విశాల హృదయాన్ని చాటుకుంటున్నాడు. తాజాగా మరో ప్రముఖ సంస్థకు బ్రాండ్ అంబాసిడర్ గా మారిపోయారు మహేశ్ బాబు. డిజిటల్ మనీ ట్రాన్సఫర్ యాప్, ఫోన్ పేకు తన గొంతును అరువుగా ఇచ్చేశారీ సూపర్ స్టార్. ఫోన్ పే నుంచి బిల్ పేమెంట్స్ చేసే టప్పుడు.. మనీ రిసీవ్డ్ అంటూ కంప్యూటర్ జనరేటెడ్ వాయిస్ వినిపిస్తూ ఉండేది. అయితే త్వరలోనే ఆ వాయిస్ కి బదులు మహేశ్ స్వీట్ వాయిస్ వినిపించనుంది. ఇందుకోసం ఫోన్ పే సంస్థ ప్రతినిధులు మహేశ్ వాయిస్ శాంపిల్స్ తీసుకుని AIతో వాయిస్ ని జెనెరేట్ చేశారట. అంటే ఇకపై ఫోన్ పే స్మార్ట్ స్పీకర్లలో నగదు లావాదేవీలను మన మహేశ్ బాబు వాయిస్ తో వినవచ్చన్నమాట.
తెలుగులో మహేశ్ బాబు వాయిస్‌లాగానే ఇతర భాషల స్టార్ హీరోలతో కూడా ఫోన్ పే ఒప్పందం కుదుర్చుకున్నట్లు సమాచారం. ఇందుకోసం బాలీవుడ్ లో బిగ్ బీ అమితాబ్ బచ్చన్, కన్నడ భాషలో కిచ్చా సుదీప్, మలయాళంలో మమ్ముట్టి తో ఫోన్ పే చర్చలు జరిపిందట. ఈ వార్త ఆయా హీరోల అభిమానులను తెగ ఖుషీ చేస్తోంది. ఇక సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో SSMB 29 సినిమాలో నటిస్తున్నాడు మహేశ్ బాబు.📱🌟