ఏం జరిగినా సరే చూస్కుందాం.. హాలీవుడ్ రేంజ్‌లో ఆపరేషన్ వాలెంటైన్ ట్రైలర్ 🎥🎉
- Suresh D
- Feb 20, 2024
- 1 min read
Updated: Feb 21, 2024
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, మిస్ వరల్డ్ మానుషి చిల్లార్ కలిసి నటించిన ఆపరేషన్ వాలెంటైన్ మూవీ ట్రైలర్ మంగళవారం (ఫిబ్రవరి 20) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. గాల్లో స్టంట్స్, దేశభక్తి డైలాగులతో వరుణ్ తేజ్ అదరగొట్టాడు.
ఈ మధ్య కాలంలో సరైన హిట్ లేక ఇబ్బందులు పడుతోన్న మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఇప్పుడు నటించిన సినిమానే 'ఆపరేషన్ వాలెంటైన్'. శక్తి ప్రతాప్ సింగ్ రూపొందించిన ఈ మూవీ ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ వార్ బ్యాగ్‌డ్రాప్‌తో పాన్ ఇండియా రేంజ్‌లో రాబోతుంది. దీంతో ఈ చిత్రంపై ఆరంభంలోనే అంచనాలు ఏర్పడ్డాయి. అందుకు తగ్గట్లుగానే దీన్ని రూపొందించారు.
వాస్తవానికి వరుణ్ తేజ్ నటించిన 'ఆపరేషన్ వాలెంటైన్' సినిమాను ఫిబ్రవరిలోనే విడుదల చేయాలని భావించారు. కానీ, అనివార్య కారణాలతో ఈ చిత్రాన్ని మార్చి 1వ తేదీకి వాయిదా వేసేశారు. దీంతో ఇప్పుడు మూవీ యూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలను కూడా ముమ్మరం చేసేసింది. ఇందులో భాగంగానే తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్‌ను విడుదల చేసింది.
తాజాగా విడుదలైన 'ఆపరేషన్ వాలెంటైన్' ట్రైలర్ గాయాలతో పెద్ద సర్జరీ జరిగిన తర్వాత కోలుకున్న హీరోకు స్పృహ రావడంతో మొదలైంది. ఆ తర్వాత అతడు ఎయిర్‌ఫోర్స్ అధికారిగా చేసిన సాహసాలు, చెప్పిన కథతో దీన్ని నడిపించారు. ముఖ్యంగా ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ శిబిరంపై జరిగిన దాడిని, తర్వాత భారత వైమానిక సైన్యం తిరుగుబాటును హైలైట్ చేశారు.
వరుణ్ తేజ్ 'ఆపరేషన్ వాలెంటైన్' ట్రైలర్ హాలీవుడ్ రేంజ్ యాక్షన్ సీక్వెన్స్‌తో హైలైట్‌గా ఉంది. ఇందులో వరుణ్ తేజ్ లుక్స్ చాలా ఫ్రెష్‌గా ఉన్నాయి. విజువల్స్ ఎంతో రిచ్‌గా, బ్యాగ్రౌండ్ స్కోర్ డీసెంట్‌గా వచ్చాయి. ముఖ్యంగా ఇందులో డైలాగులు దేశ భక్తిని రగిలించేలా రాశారు. ఫైనల్ 'ఆపరేషన్ వాలెంటైన్' ట్రైలర్ అన్ని వర్గాల వాళ్లను ఆకట్టుకునేలా వచ్చింది.
ఇదిలా ఉండగా.. వరుణ్ తేజ్- శక్తి ప్రతాప్ సింగ్ హడా కలయికలో రాబోతున్న 'ఆపరేషన్ వాలెంటైన్' మూవీని సోని పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్స్ రినైసెన్స్ పిక్చర్స్ సంస్థ ప్రతిష్టాత్మకంగా నిర్మించింది. ఇందులో 2017 మిస్ వరల్డ్ మానుషి చిల్లర్ హీరోయిన్‌గా నటించింది. అలాగే, రుహానీ శర్మ, నవదీప్ తదితరులు కీలక పాత్రలను చేశారు. 🎥🎉