హైదరాబాద్ లో రామ్ చరణ్-శంకర్ మూవీ షూటింగ్.. భారీ యాక్షన్ సీక్వెన్స్ షూట్ 🎥✨
- Suresh D
- Feb 21, 2024
- 1 min read
తాజాగా రామోజీ ఫిల్మ్ సిటీలో శంకర్ మూవీ 10 రోజుల కొత్త షెడ్యూల్ ప్రారంభమైంది. ఈ షూట్ లో రామ్ చరణ్ పాల్గొనబోతున్నారు. ఓ భారీ యాక్షన్ సీక్వెన్స్ ను ప్లాన్ చేశారు. దీనికి అన్బరివ్ మాస్టర్స్ కొరియోగ్రఫీ చేస్తున్నారు.
రామ్ చరణ్, కియారా అద్వానీ జంటగా ఎస్.శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన తెలుగు పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ ‘గేమ్ ఛేంజర్’. రామ్ చరణ్ కు ఇది 15వ చిత్రం కాగా, నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ కు ఇది 50వ చిత్రం. ఆర్ఆర్ఆర్ అఖండ విజయం తర్వాత ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న తెలుగు ప్రాజెక్టుల్లో గేమ్ ఛేంజర్ ఒకటి. ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా.. దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి తెరకెక్కించిన ‘ఆర్ఆర్ఆర్’ ప్రపంచవ్యాప్తంగా రూ.1200 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. తాజాగా రామోజీ ఫిల్మ్ సిటీలో శంకర్ మూవీ 10 రోజుల కొత్త షెడ్యూల్ ప్రారంభమైంది. ఈ షూట్ లో రామ్ చరణ్ పాల్గొనబోతున్నారు. ఓ భారీ యాక్షన్ సీక్వెన్స్ ను ప్లాన్ చేశారు. దీనికి అన్బరివ్ మాస్టర్స్ కొరియోగ్రఫీ చేస్తున్నారు. గతంలో వీరిద్దరూ ‘కేజీఎఫ్’, ‘విక్రమ్’ సినిమాలకు పనిచేశారు.
రోబో, 2.0, ఇండియన్ వంటి భారీ చిత్రాలను తెరకెక్కించిన దర్శకుడు శంకర్ గేమ్ ఛేంజర్ తో తెలుగులో దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ప్రముఖ బాలీవుడ్ నటి కియారా అద్వానీ ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. కియారా ఇంతకుముందు భరత్ అనే నేను, వినయ విధేయ రామ వంటి తెలుగు సినిమాల్లో నటించింది. అంజలి, శ్రీకాంత్, ఎస్.జె.సూర్య, నవీన్ చంద్ర తదితరులు నటిస్తున్నారు. 2024 జూన్ నాటికి సినిమాను పూర్తి చేసి 2024 సెప్టెంబర్ లో విడుదల చేయడానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. 🎥✨