top of page

మస్క్.. నువ్వు గ్రేట్.. మెదడులో చిప్ పని చేస్తోందోచ్..! 👏 🎉

కొద్ది రోజుల కిందట మనిషి మెదడులో చిప్ అమర్చింది న్యూరాలింక్ . ఇప్పుడు ఆ చిప్ ఉన్న వ్యక్తి నెమ్మదిగా కోలుకుంటున్నాడు. తన ఆలోచనలతో కంప్యూటర్ మౌస్‌ను కంట్రోల్ చేయగలుగుతున్నాడు.

👏 ఎలన్ మస్క్ నిజంగా గ్రేట్! అనుకున్నది సాధించాడు . ప్రపంచంలో కొన్ని వర్గాలు వ్యతిరేకించినా పట్టుబట్టి ప్రయోగం చేశాడు. అదే.. బ్రెయిన్‌లో చిప్‌ను అమర్చడం. న్యూరాలింక్ వ్యవస్థాపకుడు ఎలన్ మస్క్ చేసిన ఈ ప్రయోగం.. నిజంగా రాబోయే మరికొన్ని ప్రయోగాలకు మార్గం సుగుమం చేసినట్టే . కొద్ది రోజుల కిందట మనిషి మెదడులో చిప్ అమర్చింది న్యూరాలింక్ . ఇప్పుడు ఆ చిప్ ఉన్న వ్యక్తి నెమ్మదిగా కోలుకుంటున్నాడు. తన ఆలోచనలతో కంప్యూటర్ మౌస్‌ను కంట్రోల్ చేయగలుగుతున్నాడు. మస్క్ చెప్పిన ఈ మాటలు.. అందరినీ ఒక్కసారిగా ఆశ్చర్యపోయేలా చేశాయి. బ్రెయిన్‌లో చిప్ ఉన్న వ్యక్తి.. తన ఆలోచనలతోనే.. మౌస్‌ను స్క్రీన్‌పై అటూ ఇటూ మూవ్ చేయగలుగుతున్నాడు. అంటే కేవలం ఆలోచనలతోనే దానిని కమాండ్ చేయగలుగుతున్నాడు.

🖱️ కేవలం మౌస్‌ను మూవ్ చేయడమే కాకుండా మౌస్ బటన్స్‌పై ఎక్కువ క్లిక్స్ వచ్చేలా న్యూరాలింక్ ప్రయత్నిస్తోంది. ఆలోచనల వల్ల ఆ చిప్ ద్వారా మౌస్‌ను ఇంకా వేగంగా కంట్రోల్ చేయడానికి అవకాశం ఉంటుందంటున్నారు శాస్త్రవేత్తలు. ఇప్పుడు అనుకున్న రిజల్ట్ వచ్చింది కాబట్టి.. మస్క్‌ని అందరూ ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. నిజానికి ఈ ఆపరేషన్ చేపట్టడానికి మస్క్ చాలా ప్రయత్నించాల్సి వచ్చింది. మనుషులపై ఈ చిప్‌ను ప్రయోగించడానికి సెప్టెంబర్‌లోనే పర్మిషన్స్ తీసుకున్నాడు. తరువాత ఈ ఏడాది జనవరిలో మనిషి బ్రెయిన్‌లో చిప్‌ను అమర్చారు. అప్పటి నుంచి అందరిలోనూ ఒకటే ఉత్కంఠ. దీని రిజల్ట్ ఎలా ఉంటుందా అని అందరూ చాలా టెన్షన్‌తో ఎదురుచూశారు. అలాంటివారందరికీ మస్క్ గుడ్ న్యూస్ చెప్పారు.

🧠 మెదడులో చిప్ ఎందుకు పెట్టారు అంటే.. ప్రస్తుతానికైతే.. కంప్యూటర్ కీబోర్డ్, మౌస్‌ను కంట్రోల్ చేయడానికే అంటున్నా.. భవిష్యత్తులో మాత్రం ఈ ప్రయోగం వల్ల భారీ ప్రయోజనాలు చేకూరే అవకాశం ఉంది. శరీరంలో కాళ్లు, చేతులు పనిచేయకపోతే వాటిలో కదలికలు తీసుకురావడానికి ఇది ఉపయోగపడుతుందంటున్నారు. ఇక మానసిక సమస్యలు, నాడీ సమస్యలు, అల్జీమర్స్ వంటి వాటికి చికిత్సలోనూ దీని ఫలితాలను ఉపయోగించుకునే అవకాశముంది. అందుకే ఇలాంటి చిప్ ప్రయోగానికి మస్క్ ఎప్పటి నుంచో ప్రయత్నిస్తున్నారు. మొత్తానికి ఆయన పట్టుదల వల్ల ఏళ్లనాటి కల సాకారమైంది. ఇప్పటికైతే దీని వల్ల సమస్యలు లేకపోయినా.. దీని రిజల్ట్ పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చిన తరువాత భవిష్యత్తులో సమస్యలు రాకుండా చూసుకోవడం అతిపెద్ద ఛాలెంజ్ అని చెప్పాలి.

 
 
bottom of page