top of page

ఢిల్లీకి ఎన్టీఆర్ కుటుంబసభ్యులు..🌟🎞️

విశ్వవిఖ్యాత నట సార్వభౌమ, స్వర్గీయ నందమూరి తారక రామారావు గౌరవార్థం ఆయన పేరుపై రూ. 100 నాణెం విడుదల కానున్న నేపథ్యంలో ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు ఈ నెల 28న ఢిల్లీకి వెళ్లనున్నారు. ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో ఆగస్ట్ 28న ఈ కార్యక్రమం ఉండనుంది.

విశ్వవిఖ్యాత నట సార్వభౌమ, స్వర్గీయ నందమూరి తారక రామారావు గౌరవార్థం ఆయన పేరుపై రూ. 100 నాణెం విడుదల కానున్న నేపథ్యంలో ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు ఈ నెల 28న ఢిల్లీకి వెళ్లనున్నారు. ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో ఆగస్ట్ 28న ఈ కార్యక్రమం ఉండనుంది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ఎన్టీఆర్ పేరిట రూ. 100 నాణెం విడుదల కానుంది. ఈ కార్యక్రమంలో పాల్పంచుకునేందుకు కేంద్రం ఎన్టీఆర్ వారసులు, వారి కుటుంబ సభ్యులను అందరినీ ఆహ్వానించినట్లు తెలుస్తోంది. అదే సమయంలో ఎన్టీఆర్‌తో పరిచయం ఉన్న పలువురు ప్రముఖులను సైతం ఈ కార్యక్రమానికి హాజరు కావాల్సిందిగా ఆహ్వానాలు పంపించినట్టు సమాచారం అందుతోంది.44 మిల్లీ మీటర్ల చుట్టుకొలతతో ఉండే ఈ వంద రూపాయిల నాణేన్ని 50 శాతం వెండి, 40 శాతం రాగి, 5 శాతం నికెల్, 5 శాతం జింక్‌తో తయారు చేసినట్టు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వెల్లడించింది. ఈ రూ. 100 నాణేనికి అన్ని ఇతర నాణేల తరహాలోనే ఒక వైపు మూడు సింహాలతో పాటు అశోక చక్రం చిహ్నం ఉండనుండగా.. మరోవైపు ఎన్టీఆర్ ముఖ చిత్రం ఉంటాయి.🎞️💫


 
 
bottom of page