పుష్ప 2 సినిమా విడుదల తేదీ వచ్చేసింది,🎞️💫
- Suresh D
- Aug 26, 2023
- 1 min read
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న పుష్ప 2 సినిమా విడుదల తేదీ బయటికొచ్చింది. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పుష్ప 2 సినిమా చాలా వేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ సినిమా విడుదల తేదీ విషయంలో ఇప్పటికే చాలా తేదీలు బయటికొచ్చినా..ఏదీ నిర్ధారణ కాలేదు.

ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న పుష్ప 2 సినిమా విడుదల తేదీ బయటికొచ్చింది. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పుష్ప 2 సినిమా చాలా వేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ సినిమా విడుదల తేదీ విషయంలో ఇప్పటికే చాలా తేదీలు బయటికొచ్చినా..ఏదీ నిర్ధారణ కాలేదు. ఇప్పుడీ సినిమా విడుదల తేదీ దాదాపుగా పక్కాగా ఖరారైందని సమాచారం. 2024 మార్చ్ 22న సినిమా విడుదల చేయనున్నట్టు తెలుస్తోంది. త్వరలో అధికారిక ప్రకటన వెలువడవచ్చు. 2024 మార్చ్ 22వ తేదీ శుక్రవారానికి తోడు హోలీ పండుగ. ఆ తరువాత 23, 24 తేదీలు వీకెండ్స్. ఆ తరువాత శుక్రవారం 29వ తేదీ గుడ్ ఫ్లై డే, 30, 31 తేదీలు వీకెండ్స్ అంటే సినిమా విడుదలకు సరైన సమయం. పుష్ప 2 ఇక తగ్గేది ఉండదంటున్నారు. 🎞️💫