రవితేజ 'టైగర్ నాగేశ్వరరావు' టీజర్ వచ్చేస్తోంది..🎥🎞️
- Suresh D
- Aug 13, 2023
- 1 min read
మాస్ మహారాజా రవితేజ హీరోగా వంశీ దర్శకత్వం వహిస్తున్న సినిమా 'టైగర్ నాగేశ్వరరావు'.70,80 దశకాల్లో స్టువర్ట్‌పురంలో పాపులర్ దొంగగా పేరు గాంచిన నాగేశ్వరరావు జీవిత కథ నేపథ్యంలో టైగర్ నాగేశ్వరరావు తెరకెక్కుతుంది. అలాంటి గజదొంగ కథ బయోపిక్‌గా తెరకెక్కుతుండటంతో ఆడియెన్స్ లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఇప్పటికే ఈ మూవీ నుంచి రిలీజైన పోస్టర్స్, గ్లింప్స్ సినిమాపై వీర లెవల్లో అంచనాలను పెంచేశాయి. తాజాగా ఈ మూవీకి సంబంధించిన ఓ అప్ డేట్ ను మేకర్స్ వెల్లడించారు. దీనికి సంబంధించిన ఓ స్పెషల్ పోస్టర్ ను కూడా విడుదల చేశారు. ఈ సినిమా టీజర్ ను ఆగస్టు 17న విడుదల చేయబోతున్నట్లు చిత్రయూనిట్ సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. 🎥🎞️
