రెండు పార్టులుగా దళపతి విజయ్ 'లియో'..🎥🎭
- Suresh D
- Aug 13, 2023
- 1 min read
లియో నుంచి ఇప్పటికే వచ్చిన 'నా రెడీ..' ఫస్ట్ సాంగ్ మంచి టాక్ తెచ్చుకుంది. రీసెంట్‌గా రిలీజైన సంజయ్ గ్లింప్స్ కూడా సినిమాపై హైప్ క్రియేట్ చేశాయి. ఇప్పటికే టాకీ పార్ట్ మొత్తం పూర్తయింది. ప్రస్తుతం డబ్బింగ్ సహా పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఒక్కోటి కొలిక్కి వస్తున్నాయి. ఈ మూవీ పాన్ ఇండియా లెవల్లో రిలీజ్ చేయబోతున్నారు. ఈనేపథ్యంలో ప్రమోషన్స్ కూడా అదే స్థాయిలో ఫ్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాకు లోకేష్ ఓపెన్ ఎండింగ్‌ను ప్లాన్ చేశాడని సమాచారం. అంటే ఖైదీ, విక్రమ్ సినిమాలకు సీక్వెల్స్ ప్లాన్ చేస్తున్నట్లుగానే లియో సినిమాకు కూడా పార్ట్-2ను ప్లాన్ చేస్తున్నారట. ఈ వార్త తమిళనాట తెగ వైరల్ అవుతోంది. దీని గురించి అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.










































