‘ఈగల్’ మూవీ షూటింగ్ కోసం లండన్ వెళ్లిన రవితేజ🎞️🎥
- Suresh D
- Aug 21, 2023
- 1 min read
హిట్, ప్లాప్ తో సంబంధం లేకుండా వరుస సినిమాలు చేసే హీరోల్లో రవితేజ ముందుంటారు. ఏడాదికి మూడు, నాలుగు చిత్రాలతో ప్రేక్షకుల ముందుకొస్తారాయన. రెండు రోజుల క్రితం ‘టైగర్ నాగేశ్వరరావు’ సినిమా టీజర్ తో ఫ్యాన్స్ ను ఖుషీ చేశారు. దీంతో పాటు కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో రూపొందుతున్న ‘ఈగల్’ చిత్రంలోనూ రవితేజ హీరోగా నటిస్తున్నారు. ఈ చిత్రంలో మిగిలిన షూటింగ్ కోసం రవితేజ లండన్ వెళ్లారు. అక్కడ చివరి షెడ్యూల్ ను చిత్రీకరించనున్నారు.🎞️💫












































