top of page

రామ్​ చరణ్ సినిమాలో విజయ్ సేతుపతి..!🎥🎞️

దర్శకుడు శంకర్ దర్శకత్వంలో ప్రస్తుతం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా “గేమ్ చేంజర్” సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ చిత్రం తర్వాత రామ్ చరణ్ దర్శకుడు బుచ్చిబాబు సానాతో ఓ భారీ చిత్రం చేయబోతున్నాడు.

దర్శకుడు శంకర్ దర్శకత్వంలో ప్రస్తుతం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా “గేమ్ చేంజర్” సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ చిత్రం తర్వాత రామ్ చరణ్ దర్శకుడు బుచ్చిబాబు సానాతో ఓ భారీ చిత్రం చేయబోతున్నాడు. ప్రస్తుతానికి ప్రీ ప్రొడక్షన్ పనుల్లో ఉన్న ఈ చిత్రం షూటింగ్ జనవరిలో ప్రారంభం కానుందని టాక్ నడుస్తోంది. పైగా ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో విజయ్ సేతుపతి నటిస్తాడని అంటున్నారు. ఇంతకీ, విజయ్ సేతుపతి పాత్ర విలన్ పాత్రనా ?, లేక సపోర్టింగ్ పాత్రనా అనేది చూడాలి.ఇప్పటికే బుచ్చిబాబు దర్శకత్వంలో వచ్చిన ‘ఉప్పెన’ చిత్రంలో నటించిన విజయ్ సేతుపతి, మళ్లీ చరణ్ సినిమాలో కూడా నటిస్తున్నాడు అన్నమాట. అయితే దీనిపై చిత్ర బృందం నుంచి ఇంకా ఎలాంటి ప్రకటన రాలేదు.🎥🎞️


 
 
bottom of page