🎥🌟 వచ్చే సంక్రాంతికే ‘గుంటూరు కారం’ విడుదల..సూపర్ స్టార్
- Suresh D
- Aug 21, 2023
- 1 min read
‘గుంటూరు కారం’ షూటింగ్ ఆగిపోయిందని, వచ్చే సంక్రాంతికి విడుదల కష్టమేనని పుకార్లు వస్తున్నాయి. వీటికి హీరో మహేష్ బాబు ఫుల్ స్టాప్ పెట్టారు. నిన్న రాత్రి హైదరాబాద్ లో ఓ ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొన్న మహేశ్ ‘గుంటూరు కారం’ గురించి మాట్లాడారు. ఈ సినిమా సంక్రాంతికి విడుదలవుతుందన్నారు. ఆ రోజు ప్రేక్షకులంతా ఆనందంగా ఉంటారని స్పష్టం చేశారు. దీంతో, సినిమాపై పుకార్లు, అనుమానాలకు తెర పడింది. ఈ సినిమాలో మహేష్ సరసన శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటిస్తున్నారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై ఎస్. రాధాకృష్ణ నిర్మిస్తున్నారు.
