top of page

ఆసక్తి రేకెత్తిస్తున్న ‘చంద్రముఖి-2’ ట్రైలర్.🌟🎥

ప్రముఖ కొరియోగ్రాఫర్, నటుడు, దర్శకుడు రాఘ‌వ లారెన్స్‌, బాలీవుడ్ ముద్దుగుమ్మ కంగ‌నా ర‌నౌత్ నటించిన భారీ చిత్రం ‘చంద్రముఖి-2’. గతంలో రజనీకాంత్ హీరోగా వచ్చిన చంద్రముఖి చిత్రాన్ని తెరకెక్కించిన పి.వాసు ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. లైకా ప్రొడ‌క్ష‌న్స్ పై భారీ బడ్జెట్ తో రూపొందిన ఈ చిత్రం వినాయక చవితి సందర్భంగా సెప్టెంబర్ 15న తెలుగు, తమిళ భాషల్లో గ్రాండ్ గా రిలీజ్ కానుంది.ఈ నేపథ్యంలో, తాజగా ఈ మూవీ ట్రైలర్ ను విడుదల చేశారు. ట్రైలర్ అత్యంత ఆసక్తికరంగా ఉంది. ఓ థ్రిల్లర్ సినిమాకు ఉండాల్సిన హంగులన్నీ ‘చంద్రముఖి-2’ చిత్రానికి ఉన్నట్టు ట్రైలర్ చెబుతోంది. 🌟🎥



 
 
bottom of page