top of page

మరోసారి భయపెట్టడానికి రేడే అవుతున్న అనుష్క..🎥💫

అనుష్క గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కమర్షియల్ సినిమాలతో పాటు లేడీ ఓరియెంటెడ్ సినిమాలతోనూ అదరగొట్టింది అనుష్క. ముఖ్యంగా కోడి రామకృష్ణ దర్శకత్వంలో వచ్చిన అరుంధతి సినిమాతో సంచలన విజయం అందుకుంది.

అనుష్క గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కమర్షియల్ సినిమాలతో పాటు లేడీ ఓరియెంటెడ్ సినిమాలతోనూ అదరగొట్టింది అనుష్క. ముఖ్యంగా కోడి రామకృష్ణ దర్శకత్వంలో వచ్చిన అరుంధతి సినిమాతో సంచలన విజయం అందుకుంది. ఈ సినిమా హారర్ కంటెంట్ తో తెరకెక్కిన ఈ సినిమాలో అనుష్క నటన ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ఆతర్వాత పలు లేడీ ఓరియెంటెడ్ మూవీస్ తో ఆకట్టుకుంది. అలాగే చివరిగా అనుష్క నిశ్శబ్దం సినిమాతో ప్రేక్షకులకు ముందుకు వచ్చింది. ఈ సినిమా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది.ఇక ఇప్పుడు మలయాళం లో సినిమా చేస్తుంది అనుష్క. ‘కథనార్ – ది వైల్డ్ సోర్సెరర్’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాతో మలయాళంలోకి అడుగు పెడుతుంది అనుష్క. తాజాగా విడుదలైన ఈ సినిమా గ్లింప్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంది.🎥💫


 
 
bottom of page