‘ఖుషి’.. ఫస్ట్ డే కలెక్షన్స్ ..🎞️💰
- Suresh D
- Sep 2, 2023
- 1 min read
టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ, సమంత జంటగా నటించిన లేటెస్ట్ చిత్రం ఖుషి. మహానటి సినిమా తర్వాత వీరిద్దరి కాంబోలో వచ్చిన ఈ మూవీకి డైరెక్టర్ శివ నిర్వాణ దర్శకత్వం వహించారు. లవ్ అండ్ రొమాంటిక్ డ్రామా వచ్చిన ఈ సినిమా సెప్టెంబర్ 1న ఆడియన్స్ ముందుకు వచ్చింది.

టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ, సమంత జంటగా నటించిన లేటెస్ట్ చిత్రం ఖుషి. మహానటి సినిమా తర్వాత వీరిద్దరి కాంబోలో వచ్చిన ఈ మూవీకి డైరెక్టర్ శివ నిర్వాణ దర్శకత్వం వహించారు. లవ్ అండ్ రొమాంటిక్ డ్రామా వచ్చిన ఈ సినిమా సెప్టెంబర్ 1న ఆడియన్స్ ముందుకు వచ్చింది. పాటలు, ట్రైలర్ తో సినిమాపై క్యూరియాసిటీ కలిగించగా.. శుక్రవారం విడుదలైన ఈ చిత్రానికి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. ముఖ్యంగా సామ్, విజయ్ కెమిస్ట్రీ ఆకట్టుకుంది. తొలి రోజే సూపర్ హిట్ టాక్ అందుకుని అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించిన ఈ సినిమాకు భారీగానే కలెక్షన్స్ వచ్చినట్లుగా తెలుస్తోంది. నివేదికల ప్రకారం ఈ సినిమా యావత్ దేశవ్యాప్తంగా రూ.16 కోట్లు కలెక్షన్స్ రాబట్టినట్లుగా తెలుస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో 59.13 % ఆక్యుపెన్నీని, తమిళంలో 40.12%లో ఆక్యుపెన్సీని కలిగి ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ఈ శని, ఆదివారాల్లో ఈ సినిమా మరింత వసూళ్లు రాబట్టనున్నట్లు తెలుస్తోంది.🎞️💰