మళ్లీ షూటింగ్ బాటపట్టనున్న పవన్ కళ్యాణ్..🎥
- Suresh D
- Aug 22, 2023
- 1 min read
ఏపీలో రాజకీయాలు వేడెక్కుతున్న వేళ జనసేనాని మళ్లీ షూటింగ్ బాటపడుతున్నారు. కొద్దిరోజుల పాటు రాజకీయ పర్యటనలకు దూరంగా ఉండనున్నారు. రన్ రాజా రన్, సాహో చిత్రాల్ని తెరకెక్కించిన సుజిత్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ సినిమా షూటింగ్ నడుస్తోంది.

ఏపీలో రాజకీయాలు వేడెక్కుతున్న వేళ జనసేనాని మళ్లీ షూటింగ్ బాటపడుతున్నారు. కొద్దిరోజుల పాటు రాజకీయ పర్యటనలకు దూరంగా ఉండనున్నారు. రన్ రాజా రన్, సాహో చిత్రాల్ని తెరకెక్కించిన సుజిత్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ సినిమా షూటింగ్ నడుస్తోంది.కొద్దిరోజుల క్రితం ముంబైలో షూటింగ్ ప్రారంభమైన ఈ సినిమాకు సంబంధించి అప్పుడే నాలుగు షెడ్యూల్స్ పూర్తయ్యాయి. ఈ సినిమాతో పాటు చేతిలో ఉన్న ఇతర సినిమాలను పూర్తి చేసే ఆలోచనతో పవన్ కళ్యాణ్ రాజకీయాలకు కొద్దిగా బ్రేక్ ఇస్తున్నారు. అందుకే ఈ సినిమా కోసం అక్టోబర్ నెలలో 20 రోజులు, నవంబర్ నెలలో 8 రోజులు సినిమా పూర్తి చేసేందుకు పవన్ కళ్యాణ్ డేట్స్ ఇచ్చినట్లు సమాచారం. షూటింగ్ మొత్తం బ్యాంకాక్‌లో ఉండనుంది. అంటే అక్టోబర్, నవంబర్ నెలల్లో పవన్ కళ్యాణ్ రాజకీయాలకు దూరంగా ఉండనున్నారని తెలుస్తోంది.🎞️💫