మరోసారి వెండితెరపైకి ‘మాంగల్యం’ హీరో..🎞️💫
- Suresh D
- Aug 22, 2023
- 1 min read
బండి సరోజ్ కుమార్ . ఈ యూట్యూబ్ సినిమాల హీరోకి ఇప్పటికే బోలెడంత ఫ్యాన్ ఫాలోయింగ్. ముఖ్యంగా ఈయన ‘మాంగల్యం’ సినిమాకైతే కల్ట్ ఫ్యాన్స్ ఉన్నారు. దీనికి కారణం బలమైన కంటెంట్‌తో పాటు భయంకరమైన బోల్డ్‌నెస్.
బండి సరోజ్ కుమార్ . ఈ యూట్యూబ్ సినిమాల హీరోకి ఇప్పటికే బోలెడంత ఫ్యాన్ ఫాలోయింగ్. ముఖ్యంగా ఈయన ‘మాంగల్యం’ సినిమాకైతే కల్ట్ ఫ్యాన్స్ ఉన్నారు. దీనికి కారణం బలమైన కంటెంట్‌తో పాటు భయంకరమైన బోల్డ్‌నెస్. ఇప్పటి వరకు తనకు వచ్చిన ఇమేజ్ సాయంతో ఇప్పుడు మళ్ళీ మెయిన్ స్ట్రీమ్‌లోకి వెళ్లాలని బండి సరోజ్ కుమార్ నిర్ణయించుకున్నారు. బీఎస్‌కే మెయిన్‌స్ట్రీమ్ అని నిర్మాణ సంస్థను స్థాపించి సినిమాలు చేయడం మొదలుపెట్టారు. ఈ బ్యానర్ నుంచి తొలి ప్రయత్నంగా ‘పరాక్రమం’ అనే ద్విభాషా చిత్రం వస్తుంది. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ-ప్రొడక్షన్ దశలో ఉంది. బండి సరోజ్ కుమార్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాకు ఆయనే దర్శకత్వం వహిస్తున్నారు.కాగా, ఈరోజు ‘పరాక్రమం’ సినిమాను ప్రకటించడంతో పాటు ప్రీ టీజర్‌ను కూడా విడుదల చేశారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి 14న ఈ సినిమాను థియేటర్లలో విడుదల చేయనున్నారు.🎞️💫