top of page

మెగాస్టార్ 157 మూవీ ..యూవీ క్రియేషన్స్ మెగా బర్త్ డే గిఫ్ట్ 🎬🎥

Updated: Aug 24, 2023

మెగాస్టార్ చిరంజీవి 157వ సినిమా అనౌన్స్ చేశారు యూవీ క్రియేషన్స్. ఈ సినిమాకు వశిష్ఠ దర్శకత్వం వహిస్తున్నారు. బింబిసార సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడంతో వశిష్ఠకు సినిమా ఆఫర్స్ క్యూ కడుతున్నాయి.ఇప్పుడు ఏకంగా మెగాస్టార్ తో సినిమా చేస్తున్నారు.

మెగాస్టార్ చిరంజీవి 157వ సినిమా అనౌన్స్ చేశారు యూవీ క్రియేషన్స్. ఈ సినిమాకు వశిష్ఠ దర్శకత్వం వహిస్తున్నారు. బింబిసార సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడంతో వశిష్ఠకు సినిమా ఆఫర్స్ క్యూ కడుతున్నాయి.ఇప్పుడు ఏకంగా మెగాస్టార్ తో సినిమా చేస్తున్నారు. తాజాగా ఈ మూవీ నుంచి ప్రీ లుక్ ను రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ చూస్తుంటే ఈ సినిమా కూడా పిరియాడికల్ డ్రామాగా తెరకెక్కనుందని అర్ధమవుతుంది. ఒక స్టార్ సింబల్ తో ఈ పోస్టర్ ను డిజైన్ చేశారు. అలాగే ఆ స్టార్ లో పంచభూతాలైన.. నీరు, నిప్పు, గాలి, భూమి, ఆకాశంను చూపించారు. ఈ పంచభూతాల శక్తి మెగాస్టార్ అంటూ ఈ పోస్టర్ ను సోషల్ మీడియాలో పంచుకున్నారు మేకర్స్. దాంతో ఈ సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలుపనున్నారు.🎞️💫


 
 
bottom of page