మెగా డాటర్ సుష్మిత నిర్మాతగా చిరంజీవి 156 మూవీ 🎞️💫
- Suresh D
- Aug 22, 2023
- 1 min read
చిరంజీవి తన కుమార్తె సుష్మిత కొణిదెల నిర్మాణంలో ఓ సినిమా చేయనున్నట్లు చాలా రోజుల నుంచి వార్తలు వస్తున్నాయి. కళ్యాణ్ కృష్ణ కురసాల దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కనుందని టాక్ నడిచింది. మరి ఇన్ని రోజులు ఉన్న బజ్ ప్రకారమే మెగాస్టార్ 156వ చిత్రాన్ని కూతురు సుష్మిత కొణిదెల తన బ్యానర్ గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్ లో నిర్మాణం వహిస్తున్నట్లు అధికారిక అప్డేట్ ఇప్పుడు వచ్చింది. ఈ నేపథ్యంలో తాజాగా మెగాస్టార్ బర్త్ డే సందర్భంగా ఓ స్పెషల్ పోస్టర్ ని రిలీజ్ చేసారు. అయితే ఇంకా దర్శకుడు ఎవరు అనేది డిసైడ్ కాలేదు కానీ ఆ అప్డేట్ సహా ఇతర వివరాలు త్వరలోనే వెల్లడించనున్నారు.🎞️💫
