top of page

‘ఎల్‌జీఎమ్’ తెలుగులో రిలీజ్‌కు సర్వం సిద్ధం..🌟🎥

కుటుంబంలోని మ‌నుషులు అంద‌రూ ఒకేలా ఉండాల‌నేం లేదు.. ఒక్కొక్కరి మ‌న‌స్త‌త్వం ఒక్కోలా ఉంటుంది. దీని వ‌ల్ల మ‌న‌స్ప‌ర్థలు వ‌స్తుంటాయి..పోతుంటాయి. కానీ బంధాలు, బంధుత్వాల‌ను మ‌నం విడిచి పెట్ట‌లేం.

కుటుంబంలోని మ‌నుషులు అంద‌రూ ఒకేలా ఉండాల‌నేం లేదు.. ఒక్కొక్కరి మ‌న‌స్త‌త్వం ఒక్కోలా ఉంటుంది. దీని వ‌ల్ల మ‌న‌స్ప‌ర్థలు వ‌స్తుంటాయి..పోతుంటాయి. కానీ బంధాలు, బంధుత్వాల‌ను మ‌నం విడిచి పెట్ట‌లేం. ముఖ్యంగా కొత్త పెళ్లి చేసుకోవాల‌నుకునే అబ్బాయి, అమ్మాయిల‌కు మ‌న‌సులో తెలియ‌ని భ‌యాలు ఎన్నో ఉంటాయి. మ‌రీ ముఖ్యంగా అత్తా కోడ‌ళ్ల మ‌ధ్య ఉండే రిలేష‌న్ గురించి ఎంత చెప్పినా తక్కువే. అలా మ‌న‌సుకి ప్రేమించిన అబ్బాయిని పెళ్లి చేసుకోవాల‌నుకున్న అమ్మాయి కాబోయే అత్త‌గారి గురించి భ‌యప‌డుతుంది. అందు కోసం ఆమెతో క‌లిసి కొన్ని రోజుల పాటు ఆమెతో క‌లిసి ట్రావెల్ చేయాల‌నుకుంటుంది. అందుకు ఒప్పుకున్న అత్తా కోడ‌ళ్ల మ‌ధ్య ఉండే కండీష‌న్స్ ఏంటి? చివ‌ర‌కు వారిద్ద‌రూ మ‌న‌స్త‌త్వాలు క‌లిశాయా? అనే వైవిధ్య‌మైన పాయింట్‌తో తెర‌కెక్కిన ఔట్ అండ్ ఔట్ ఫ‌న్ అండ్ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌ ‘ఎల్‌జీఎం’ (లెట్స్‌ గెట్‌ మ్యారీడ్‌). ఆగస్ట్ 4న ఈ చిత్రాన్ని తెలుగు రాష్ట్రాల్లో జె.పి.ఆర్‌.ఫిల్మ్స్‌, త్రిపుర ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్స్ భారీ లెవ‌ల్లో విడుద‌ల చేస్తున్నాయి.🎬🎭


 
 
bottom of page