సెన్సార్ కంప్లీట్ చేసుకున్న. “కింగ్ ఆఫ్ కొత్త”🎥💫
- Suresh D
- Aug 23, 2023
- 1 min read
మోలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో దుల్కర్ సల్మాన్ హీరోగా ఐశ్వర్య లక్ష్మీ హీరోయిన్ గా దర్శకుడు అభిలాష్ జోషి తెరకెక్కించిన భారీ చిత్రం “కింగ్ ఆఫ్ కొత్త” కోసం తెలిసిందే.

మోలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో దుల్కర్ సల్మాన్ హీరోగా ఐశ్వర్య లక్ష్మీ హీరోయిన్ గా దర్శకుడు అభిలాష్ జోషి తెరకెక్కించిన భారీ చిత్రం “కింగ్ ఆఫ్ కొత్త” కోసం తెలిసిందే. మరి దుల్కర్ సల్మాన్ కెరీర్ లోనే భారీ చిత్రంగా తెరకెక్కించిన ఈ చిత్రాన్ని అయితే పాన్ ఇండియా లెవల్లో ప్లాన్ చేశారు. ఇక మన తెలుగులో కూడా ఈ చిత్రానికి మంచి ప్రమోషన్స్ చేస్తూ డీసెంట్ బజ్ ని అందుకున్న మేకర్స్ ఇప్పుడు తెలుగు వెర్షన్ లో సెన్సార్ ని కంప్లీట్ చేసుకున్నారు.ఇక మన తెలుగులో అయితే ఈ చిత్రానికి యూ/ఏ సర్టిఫికెట్ ని సెన్సార్ బోర్డు వారు అందించారు. దీనితో మొత్తానికి అన్ని పనులు కంప్లీట్ చేసుకొని ఈ చిత్రం ఇప్పుడు రిలీజ్ కి రాబోతుంది. ఇక ఈ చిత్రానికి జేక్స్ బిజోయ్ సంగీతం అందించగా ఈ4 మూవీస్ మరియు జీ స్టూడియోస్ వారు సంయుక్తంగా భారీ బడ్జెట్ తో ఓ పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా అయితే దీనిని తెరకెక్కించారు.🎥💫