ఆరేళ్ల తర్వాత కెమెరా ముందుకు మంచు మనోజ్..🎥💫
- Suresh D
- Aug 22, 2023
- 1 min read
గోడకు కొట్టిన బంతిలా మళ్లీ తిరిగొచ్చాడీ యంగ్ హీరో. అటు పర్సనల్ లైఫ్, ఇటు ప్రొఫెషనల్ లైఫ్ పరంగా నూతన అధ్యాయానికి శ్రీకారం చుట్టాడు. ఈ ఏడాది మార్చిలో భూమా మౌనికా రెడ్డిని పెళ్లి చేసుకున్నాడు మనోజ్.

గోడకు కొట్టిన బంతిలా మళ్లీ తిరిగొచ్చాడీ యంగ్ హీరో. అటు పర్సనల్ లైఫ్, ఇటు ప్రొఫెషనల్ లైఫ్ పరంగా నూతన అధ్యాయానికి శ్రీకారం చుట్టాడు. ఈ ఏడాది మార్చిలో భూమా మౌనికా రెడ్డిని పెళ్లి చేసుకున్నాడు మనోజ్. అదే సమయంలో ‘వాట్ ది ఫిష్’ అనే కొత్త సినిమాను ప్రకటించాడు. తద్వారా తాను సినిమాలకు దూరమయ్యాడంటూ వస్తున్న పుకార్లను కొట్టి పారేశాడు. తాజాగా ఈ సినిమా షూటింగ్‌లో జాయిన్ అయ్యాడు మనోజ్. సుమారు ఆరేళ్ల తర్వాత కెమెరా ముందుకు వచ్చిన మనోజ్ కాస్త ఎమోషనల్ అయ్యాడు. ఈ సందర్భంగా సినిమా షూటింగ్‌లో కెమెరాకు దండం పెడుతున్న ఫొటోను అభిమానులతో షేర్ చేసుకున్నాడు. ‘అమ్మ లాంటి సినిమా దగ్గరకు మళ్లీ వచ్చాను. లవ్ యూ ఆల్’ అంటూ ఎమోషనల్ ట్వీట్ చేశాడు. ప్రస్తుతం ఈ ఫొటో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది.’మనోజ్ అన్నా కమ్ బ్యాక్.. మీ సినిమా సూపర్ హిట్ కావాలి’ అంటూ అభిమానులు,నెటిజన్లు విషెస్ చెబుతున్నారు.🎥💫