కాంతారా సీక్వెల్ త్వరలో షూటింగ్ మొదలు🎥💫
- Suresh D
- Aug 23, 2023
- 1 min read
కన్నడ యాక్షన్ థ్రిల్లర్ కాంతారా. 16 కోట్ల స్వల్ప బడ్జెట్‌తో తెరకెక్కి ప్రపంచవ్యాప్తంగా 400 కోట్లు కురిపించిన సినిమా..రిషభ్ శెట్టిని రాత్రికి రాత్రి పాన్ ఇండియా పటంలో అగ్ర నటుడిగా, దర్శకుడిగా నిలబెట్టేసింది. ఈ సినిమా 100 రోజుల వేడుకలో కాంతారా 2 ఉంటుందని ప్రకటించారు.

కన్నడ యాక్షన్ థ్రిల్లర్ కాంతారా. 16 కోట్ల స్వల్ప బడ్జెట్‌తో తెరకెక్కి ప్రపంచవ్యాప్తంగా 400 కోట్లు కురిపించిన సినిమా..రిషభ్ శెట్టిని రాత్రికి రాత్రి పాన్ ఇండియా పటంలో అగ్ర నటుడిగా, దర్శకుడిగా నిలబెట్టేసింది. ఈ సినిమా 100 రోజుల వేడుకలో కాంతారా 2 ఉంటుందని ప్రకటించారు. అప్పటి నుంచి కాంతారా 2 ఎప్పుడా అనే ఆసక్తి పెరిగిపోయింది. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఆ నిరీక్షణ ఇప్పుడు తొలగింది. కాంతారా మొదటి భాగం రిషభ్ శెట్టి సొంత ఊరు కుందాపురలో జరగగా, రెండవ భాగం మంగళూరులో చేసేందుకు నిశ్చయించారు. రెండవ భాగం స్క్రిప్ట్‌కు అటవీ ప్రాంతం, భూమి, నీరు కావల్సి ఉంటాయి. అందుకే మంగళూరు ఎంచుకున్నట్టు తెలుస్తోంది. కాంతారా 1 కంటే ఈసారి భారీ బడ్జెట్‌గా ఈ సినిమా ఉండనుంది. నాలుగు నెలల షెడ్యూల్ లో సినిమా షూటింగ్ ఉంటుంది. అంటే 2024 మొదటి త్రైమాసికానికి సినిమా షూటింగ్ పూర్తి చేసి..అదే ఏడాది చివర్లో విడుదల చేసేందుకు ఆలోచిస్తున్నారు. 🎥💫