గేమ్ ఛేంజర్ పై ఇంట్రెస్టింగ్ అప్డేట్.. 🎥🎞️
- Suresh D
- Aug 13, 2023
- 1 min read
ఆర్ఆర్ఆర్ చిత్రంతో గ్లోబల్ స్టార్ గా మారిన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, దిగ్గజ దర్శకుడు శంకర్ కాంబినేషన్ లో వస్తన్న చిత్రం ‘గేమ్ చేంజర్’.తాజాగా ఈ సినిమాకు సంబంధించి మరో ఆసక్తికర వార్త ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఈ చిత్రంలో చరణ్ ఏడు గెటప్స్‌లో కనిపించబోతున్నాడట. సాధారణంగా శంకర్ సినిమాల్లో హీరోలు ఇలా రకరకాల లుక్స్‌లో కనిపించడం సహజమే. సన్నివేశాలతో పాటు పాటల్లో హీరోలను డిఫరెంట్ లుక్స్‌లో ప్రెజెంట్ చేయడం శంకర్ స్టయిల్. ఈ క్రమంలో ‘గేమ్ చేంజర్’లో చరణ్ ఏడు రకాల లుక్స్‌లో కనిపిస్తాడని తెలుస్తోంది. ఇప్పటికైతే ఐఏఎస్ ఆఫీసర్, రాజకీయ నాయకుడి పాత్రతో పాటు మిడిల్ ఏజ్ లుక్‌లో కనిపిస్తాడని తెలుస్తోంది. మరో నాలుగు గెటప్స్ కథలో భాగమా? లేక పాటల్లో వస్తాయా? అనేది ప్రస్తుతానికి సస్పెన్స్. 🎥🎞️
