top of page

జీలం నదిలో పడవ బోల్తా.. ఆరుగురు చిన్నారులు మృతి

శ్రీనగర్‌లోని జీలం నదిలో మంగళవారం ఘోర పడవ ప్రమాదం చోటుచేసుకుంది. పడవ బోల్తాపడి ఆరుగురు చిన్నారుల మృతిచెందగా.. మరో పది మంది గల్లంతయ్యారు.

నదిని దాటేందుకు ఉపయోగించే తాడు అకస్మాత్తుగా తెగిపోవడంతో పడవ బోల్తా పడిందని అధికారులు తెలిపారు. గత కొద్ది రోజులుగా కురుస్తోన్న భారీ వర్షాలకు జీలం నదిలో ప్రవాహం ఎక్కువగా ఉందని, దీంతో ప్రాణనష్టం జరిగిందని పేర్కొన్నారు. ప్రమాద సమయానికి పడవలో మొత్తం 20 మంది వరకూ ఉన్నారని, వీరిలో ఎక్కువ మంది పిల్లలే అన్ని చెప్పారు. మరో 10 మంది గల్లంతయ్యారని, వారి కోసం గజ ఈతగాళ్లతో గాలిస్తున్నామని వివరించారు.ప్రమాదం గురించి సమాచారం అందుకున్న రాష్ట్ర విపత్తు నిర్వహణ దళం బృందాలు హుటాహుటిన ఘటనా స్థలికి చేరుకుని రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభించాయి. గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.


 
 
bottom of page