దంచికొడుతున్న ఎండలు..TSRTC కీలక నిర్ణయం✨
- MediaFx

- Apr 16, 2024
- 1 min read
తెలంగాణలో ఎండలు దంచికొడుతున్నాయి. ఉదయం 7 నుంచి భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. ఉదయం 9 తర్వాత రోడ్లపై జన సంచారం తగ్గుతోంది.
సూర్యుడు నిప్పుల వర్షం కురిపించటంతో పాటు భానుడి భగభగలతో ప్రజలు అల్లాడి పోతున్నారు. వీడగాలులతో ఇబ్బందులు పడుతున్నారు. ఎండల తీవ్రత తాజాగా TSRTCపై పడింది. ఎండలు మండుతుండటంతో అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. హైదరాబాద్‌లో రోజురోజుకు ఎండలు పెరుగుతుండటంతో గ్రేటర్ పరిధిలో బస్సుల సంఖ్య తగ్గించాలని నిర్ణయం తీసుకున్నారు. ఎండల ప్రభావం ఎక్కువగా ఉండే మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు బస్సుల సంఖ్యను తగ్గించనున్నట్లు అధికారులు తెలిపారు. ఎండల తీవ్రతతో మధ్యాహ్నాం వేళల్లో ప్రయాణికులు తక్కువగా ఉంటున్నారని అందుకే తగ్గిస్తున్నట్లు వెల్లడించారు. ఈనెల 17 నుంచి బస్సు సర్వీసుల తగ్గింపు అమల్లోకి రానున్నట్లు ఆర్టీసీ గ్రేటర్ జోన్ ఈడీ తెలిపారు. ప్రయాణికులు ఈ విషయాన్ని అర్ధం చేసుకోవాలని సూచించారు.✨












































