top of page

మద్యం దుకాణాలు బంద్‌..🍻🚫

సాధారణంగా మద్యం దుకాణాలకు ప్రత్యేకంగా సెలవులు అనేవి ఏం ఉండవు. ఆదివారం, సోమవారం అనే తేడా లేకుండా మందు బాబులు మద్యాన్ని సేవిస్తుంటారు. అందుకే వారికి అందుబాటులో ప్రతీ రోజూ మద్యం దుకాణాలు తెరిచే ఉంటాయి. అయితే కొన్ని ప్రత్యేక సందర్భాల్లో మాత్రం మద్యం దుకాణాలను అధికారులు మూసి వేస్తుంటారు.

ree

ఎలాంటి అవంఛనీయ సంఘటనలు జరగకూడదనే ఉద్దేశంతో మద్యం దుకాణాలు మూసివేయిస్తుంటారు. ఈ క్రమంలోనే తాజగా శ్రీరామనవమిని పురస్కరించుకొని హైదరాబాద్‌ జంట నగరాల్లో ఒకరోజు మద్యం దుకాణాలు బంద్‌ చేస్తూ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఈ నెల 17వ తేదీ (బుధవారం) మద్యం దుకాణాలు బంద్‌ కావాల్సిందే అంటూ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు హైదరాబాద్ సీపీ ఆదేశాలు జారీ చేశారు. ఎవరైనా ఆదేశాలను బేఖాతరు చేస్తూ ఎవరైనా మద్యం దుకాణాలు తెరిస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.శ్రీరామనవమి పర్వదినం సందర్భంగా నగరంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకూడదనే ఉద్దేశంతో ఏప్రిల్ 17వ తేదీ ఉదయం 6 గంటల నుంచి ఏప్రిల్ 18వ తేదీ ఉదయం 6 గంటల వరకు హైదరాబాద్ జంట నగరాల్లో ఉన్న వైన్స్‌, కల్లు కాంపౌండ్లు, బార్లు, బార్ అండ్ రెస్టారెంట్లు అన్నీ మూతపడనున్నాయి. ఈ మేరకు హైదరాబాద్ సీపీ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు.🍻


 
 
bottom of page