top of page

భోళా శంకర్ రెమ్యూనరేషన్‌ను తిరిగిచ్చిన చిరంజీవి.?🎥🎞️

మెగాస్టార్ చిరంజీవి తాజా చిత్రం 'భోళాశంకర్' నిరాశ పరిచిన సంగతి తెలిసిందే. తమన్నా, కీర్తి సురేష్, సుశాంత్, శ్రీముఖి, రష్మి, వెన్నెల కిశోర్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రం ఈ నెల 11న విడుదలయింది. ఎన్నో అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చతికిలపడింది.

మెగాస్టార్ చిరంజీవి తాజా చిత్రం 'భోళాశంకర్' నిరాశ పరిచిన సంగతి తెలిసిందే. తమన్నా, కీర్తి సురేష్, సుశాంత్, శ్రీముఖి, రష్మి, వెన్నెల కిశోర్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రం ఈ నెల 11న విడుదలయింది. ఎన్నో అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చతికిలపడింది. మరోవైపు ఈ సినిమాకు సంబంధించి ఒక వార్త వైరల్ అవుతోంది. ఈ సినిమాకు చిరంజీవి రూ. 55 కోట్ల రెమ్యునరేషన్ తీసుకున్నారట. ఈ మొత్తాన్ని సినిమా విడుదలకు ముందే చిరంజీవికి నిర్మాత ఇచ్చేశారట. ఇందులో రూ. 10 కోట్లకు చెక్ ఇచ్చారట. అయితే సినిమాకు నష్టాలు రావడంతో... రూ. 10 కోట్ల చెక్ ను చిరంజీవి వెనక్కి ఇచ్చేశారట. మరోవైపు ఈ సినిమాను హిందీలో కూడా విడుదల చేస్తున్నారు. ఆగస్టు 25న హిందీ వర్షన్ విడుదల చేస్తున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. హిందీలో చిరంజీవికి ప్రముఖ నటుడు జాకీ ష్రాఫ్ డబ్బింగ్ చెప్పినట్టు సమాచారం.🎥🎞️


 
 
bottom of page