మిస్టర్ ప్రెగ్నెంట్ మూవీ రివ్యూ. 🎥💫
- Suresh D
- Aug 18, 2023
- 1 min read
మిస్టర్ ప్రెగ్నెంట్ లాంటి కథలు అరుదుగా వస్తాయి. ఇవన్నీ కూడా ప్రయోగాల కిందకే వస్తాయి. కాస్త తేడా కొడితే జనాలు అస్సలు పట్టించుకోరు. నచ్చితే నెత్తిన పెట్టేసుకుంటారు. ఈ మిస్టర్ ప్రెగ్నెంట్ ఈ రెండు కోవలకు చెందేట్టుగా కనిపించడం లేదు. ఈ ప్రయోగం గొప్పగా ఉందని చెప్పలేం.. అలా అని నాసిరకంగానూ ఉందని చెప్పలేం.

మిస్టర్ ప్రెగ్నెంట్ లాంటి కథలు అరుదుగా వస్తాయి. ఇవన్నీ కూడా ప్రయోగాల కిందకే వస్తాయి. కాస్త తేడా కొడితే జనాలు అస్సలు పట్టించుకోరు. నచ్చితే నెత్తిన పెట్టేసుకుంటారు. ఈ మిస్టర్ ప్రెగ్నెంట్ ఈ రెండు కోవలకు చెందేట్టుగా కనిపించడం లేదు. ఈ ప్రయోగం గొప్పగా ఉందని చెప్పలేం.. అలా అని నాసిరకంగానూ ఉందని చెప్పలేం. కానీ థియేటర్ నుంచి బయటకు వచ్చేటప్పుడు మాత్రం ఆలోచనలో పడతాం. మనసు భారంగానే అవుతుంది. తల్లి పడే కష్టం ఎలా ఉంటుందో దర్శకుడు చూపించే ప్రయత్నం చేశాడు.
ఆనందాన్ని మగాళ్లకి ఇచ్చి.. 9 నెలల కష్టాన్ని మాత్రం ఆడవాళ్లకి ఎందుకు ఇచ్చావ్ అంటూ సోహెల్ ఇందులో చెప్పిన డైలాగ్‌లెన్నో ఆలోచనలు రేకెత్తించేలా ఉంటాయి. అయితే ఇలాంటి ఎమోషనల్ కథకు ప్రేక్షకుడు కనెక్ట్ కాగలిగితే రిజల్ట్ వేరేలా ఉంటుంది. మిస్టర్ ప్రెగ్నెంట్ మూవీలో అది అంతగా జరగలేదనిపిస్తుంది. ఫస్ట్ హాఫ్ అంతా సోసోగా జరుగుతుంది. అసలు ఎమోషన్ అంతా సెకండాఫ్‌లోనే ఉండటంతో ప్రథమార్దం తేలిపోయినట్టుగా అనిపిస్తుంది. ఫస్ట్ హాఫ్‌లో ఎక్కడా కూడా హాయిగా నవ్వుకునే, మనసును హత్తుకునే సీన్లు కనిపించవు. ఇంటర్వెల్‌కు కాస్త రక్తికట్టినట్టుగా అనిపిస్తుంది.
సెకండాఫ్‌లోనే అసలు కథ అంతా దాగి ఉంటుంది. ఓ మగాడికి గర్భం వస్తే.. తొమ్మిది నెలలు బిడ్డను మోస్తే.. తండ్రి కాస్త తల్లిగా మారితే ఎలా ఉంటుందో చూపించాడు. తొమ్మిది నెలలు ఎంత నరకంగా ఉంటుందో.. ఆ నరకాన్ని తల్లి ఎంత ఆనందంగా భరిస్తుందో చెప్పే ప్రయత్నం చేశాడు. ఇక ఇలా మగాడు గర్భం దాల్చితే సమాజం, మీడియా ఎలా చూస్తుంది.. ఎలాంటి నిందలు వేస్తుంది.. ఎంత హేలన చేస్తుందో చూపించాడు డైరెక్టర్. ప్రథమార్దం పట్టాలు తప్పినా.. సెకండాఫ్ మాత్రం ప్రేక్షకులను ఆకట్టుకునేలా తెరకెక్కించాడు.సోహెల్ తన పాత్రకు వంద శాతం న్యాయం చేశాడు. తనలోనూ ఓ నటుడు ఉన్నాడని ఈ సినిమాతో నిరూపించుకున్నాడు.