🇮🇳 మన ‘హనూమ్యాన్’ వచ్చేస్తున్నాడు..! చాట్ జీపీటీకి మించిన రేంజ్‌లో భారత్ జీపీటీ..
- Suresh D
- Feb 22, 2024
- 2 min read
చాట్ జీపీటీ స్టైల్లోనే సేవలు అందించే విధంగా దానిని తీర్చిదిద్దారు. రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ అధినేత ముఖేష్ అంబానీ భారత్ జీపీటీ పేరిట దీనిని వచ్చే నెలలో అంటే మార్చిలో దీనిని లాంఛనంగా ఆవిష్కరించనున్నారు.
🤖 ఓపెన్ ఏఐ తీసుకొచ్చిన చాట్ జీపీటీ ఎంతటి సెన్సేషన్ సృష్టించిందో అందరికీ తెలిసిందే. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) సాంకేతితకతతో వచ్చిన ఈ అధునాతన సెర్చ్ ఇంజిన్ మొత్తం వ్యవస్థనే మార్చేసింది. ఈ క్రమంలో అన్ని టెక్ దిగ్గజాలు అనివార్యంగా ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)ను వినియోగించాల్సిన పరిస్థితిని తీసుకొచ్చింది. ఈ క్రమంలో మన దేశీయ ఏఐ టూల్ ఒకటి త్వరలో అందుబాటులోకి రానుంది. చాట్ జీపీటీ స్టైల్లోనే సేవలు అందించే విధంగా దానిని తీర్చిదిద్దారు. రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ అధినేత ముఖేష్ అంబానీ భారత్ జీపీటీ పేరిట దీనిని వచ్చే నెలలో అంటే మార్చిలో దీనిని లాంఛనంగా ఆవిష్కరించనున్నారు. మన దేశంలోని టాప్ ఇంజినీరింగ్ స్కూల్స్ తో కలిసి దీనిని రూపొందించారు. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో మన దేశ ఆశయాలకు ఇది పెద్ద ఊతం ఇచ్చినట్లు అవుతుందని నిపుణులు చెబుతున్నారు.
హనూమ్యాన్ పేరుతో..
భారత్ జీపీటీ లాంగ్వేజ్ మోడల్ ను రిలయన్స్ తో పాటు దేశంలోని ఎనిమిది అనుబంధ విశ్వవిద్యాలయాలు కలిసి రూపొందించాయి. ఈ లాంగ్వేజ్ మోడల్ ను మంగళవారం ముంబైలో జరిగిన సాంకేతిక సదస్సులో ప్రదర్శించారు. అక్కడి ప్రతినిధుల ముందు ప్లే చేసిన వీడియోలో, దక్షిణ భారతదేశంలోని ఒక మోటార్‌సైకిల్ మెకానిక్ తన మాతృభాష తమిళంలో ఏఐ బాట్‌ను ప్రశ్నలు అడిగాడు. అలాగే ఒక బ్యాంకర్ హిందీలో సంభాషించాడు. హైదరాబాద్‌లోని ఒక డెవలపర్ కంప్యూటర్ కోడ్ రాయడానికి దానిని ఉపయోగించాడు. కాగా ఈ మోడల్ విజయవంతమైతే ఈ చాట్ బాట్ ను ‘హనూమ్యాన్’ గా పిలిచే అవకాశం ఉంది. దీని రాకతో రానున్న రోజుల్లో ఏఐ సాంకేతికతతో మరిన్ని ఏఐ దేశీయ టూల్స్ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.
భారత్ జీపీటీ ఇలా..
భారత్ జీపీటీ నాలుగు ప్రధాన రంగాలలో 11 స్థానిక భాషల ద్వారా పని చేస్తుందని ఆ నమూనా స్పష్టం చేసింది. ఆ రంగాలు ఏంటంటే ఆరోగ్య సంరక్షణ, పాలన, ఆర్థిక సేవలు, విద్య. వైర్‌లెస్ క్యారియర్ రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ లిమిటెడ్, భారత ప్రభుత్వం మద్దతుతో ముంబైతో సహా ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ విశ్వవిద్యాలాల సహకారంతో ఈ మోడల్ రూపుదిద్దుకుంది.
మరో మోడల్ కూడా..
లైట్‌స్పీడ్ వెంచర్ పార్ట్‌నర్స్, బిలియనీర్ వినోద్ ఖోస్లాస్ ఫండ్ వంటి ప్రముఖ వీసీ పెట్టుబడిదారుల మద్దతుతో సర్వం అండ్ క్రుట్రిమ్ వంటి స్టార్టప్‌ల సమూహం కూడా ఓపెన్ సోర్స్డ్ ఏఐ మోడళ్లను రూపొందించేందుకు ముమ్మర ప్రయత్నాలు చేస్తోంది. ఓపెన్ ఏఐ వంటి సిలికాన్ వ్యాలీ కంపెనీలు ఎప్పుడూ పెద్ద ఎల్ఎల్ఎంలను నిర్మిస్తుండగా, గణన పరిమితులు, చిన్న వ్యాపారాలు,ప్రభుత్వ విభాగాలకు అందుబాటులో ఉండే సరళమైన నమూనాల కారణంగా ఆ ప్రయత్నాలలో పరిష్కారాలు ఉంటాయి.