top of page

నిలిచిపోనున్న పేటీఎం ఫాస్టాగ్ సేవలు! మరి ప్రత్యామ్నాయం ఏంటి? ఇవిగో చాలా ఉన్నాయ్..✨✅

ఎన్ హెచ్ఏఐ ఇటీవల పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్ (పీపీబీఎల్)ను ఈ ఫాస్టాగ్ సేవల నుంచి డీలిస్ట్ చేయడంతో వినియోగదారులు ఏం చేయాలనే ఆందోళనలో ఉన్నారు. అయితే ఇంకా చాలా బ్యాంకులు ఈ సేవలను అందిస్తున్నాయి.

జాతీయ రహదారులపై ప్రయాణించాలంటే నాలుగు చక్రాలకు పై బడిని వాహనాలన్నీ టోల్ చార్జి చెల్లించాల్సి ఉంటుంది. గతంలో డైరెక్ట్ డబ్బులు చెల్లించి టోల్ టోకెన్ తీసుకునే వారు . దీంతో సమయం చాలా వృథా అవుతుండటంతో ఆధునిక టెక్నాలజీని తీసుకొచ్చారు. సులభర టోల్ పేమెంట్స్ కోసం ఫాస్టాగ్ ను ప్రవేశపెట్టారు. ఇది లెవరేజింగ్ రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్(ఆర్ఎఫ్ఐడీ) టెక్నాలజీతో పనిచేస్తుంది. దీని సాయంతో మీ వాహనం టోల్ దగ్గరకు వెళ్లగానే ఆటోమేటిక్ గా బ్యాంక్ అకౌంట్ ను నుంచి సంబంధిత టోల్ చార్జ్ కట్ అయ్యే విధంగా ఓ ప్రత్యేకమైన డివైజ్ ను కారు ముందు గ్లాస్ భాగంలో అమర్చుతారు. ఇది టోల్ లోపలికి రాగానే అక్కడ ఉండే మరో డివైజ్ దీనితో సింక్రనైజ్ అయ్యి ఆటోమేటిక్ గా అకౌంట్ నుంచి చెల్లింపులు జరిగిపోతాయి.

నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా(ఎన్ హెచ్ఏఐ) లోని ఇండియన్ హైవేస్ మేనేజ్ మెంట్ కంపెనీ(ఐహెచ్ఎంసీఎల్) విభాగం డిజిటల్ టోల్ కలెక్షన్స్ ను నిర్వహిస్తుంది. ఒక్కసారి ఈ ఫాస్టాగ్ తీసుకుంటే ఐదేళ్లు యాక్టివ్ గా ఉంటుంది. దానిలో ఎప్పటికప్పుడు డబ్బులు వేసుకుంటూ ఉండాలి. అంటే రీచార్జ్ చేసుకుంటూ ఉండాలి. ఈ ఫాస్టాగ్ సేవలను పేటీఎంతో పాటు దాదాపు ఇతర 30 బ్యాంకులు ఈ సేవలను అందిస్తున్నాయి. ఎక్కువ శాతం పేటీఎంనే ఎక్కువ మంది వినియోగదారులు వాడుతున్నారు. అయితే ఎన్ హెచ్ఏఐ ఇటీవల పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్(పీపీబీఎల్)ను ఈ ఫాస్టాగ్ సేవల నుంచి డీలిస్ట్ చేయడంతో వినియోగదారులు ఏం చేయాలనే ఆందోళనలో ఉన్నారు. అయితే ఇంకా చాలా బ్యాంకులు ఈ సేవలను అందిస్తున్నాయి. ఈ క్రమంలో ఫాస్టాగ్ సేవలను అందిస్తున్న బ్యాంకుల వివరాలు ఇప్పడు చూద్దాం..

ఫాస్టాగ్ సేవలను అందిస్తున్న బ్యాంకులివే..✨🚗

నేషనల్ హైవేస్ అథారిటీ ఫాస్టాగ్ సేవలను అందదించే బ్యాంకుల జాబితాను తెలిపింది. వాటిల్లో ఎయిర్ టెల్ పేమెంట్స్ బ్యాంక్, అలహాబాద్ బ్యాంక్, ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్, యాక్సిన్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, కెనరా బ్యాంక్, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, సిటీ యూనియన్ బ్యాంక్, కాస్మోస్ బ్యాంక్ వంటి విస్తృత శ్రేణిని కలిగి ఉన్నాయి. అలాగే ఈక్విటాస్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్, ఫెడరల్ బ్యాంక్, ఫినో పేమెంట్స్ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, ఐడీబీఐ బ్యాంక్, ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్, ఇండియన్ బ్యాంక్, ఇండస్ఇండ్ బ్యాంక్, కేఅండ్ కే బ్యాంక్, కర్ణాటక బ్యాంక్, కరూర్ వైశ్యా బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంక్, నాగ్పూర్ నాగరిక్ సహకారీ బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్, సరస్వత్ బ్యాంక్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, త్రిసూర్ డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ బ్యాంక్, యూకో బ్యాంక్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఎస్ బ్యాంక్ వంటివి ఉన్నాయి. 

ఫాస్టాగ్ ఎలా కొనుగోలు చేయాలి..?✨✅

ఫాస్టాగ్ ని కొనుగోలు చేయడానికి ఎన్ఈటీసీ సభ్య బ్యాంకులు / వారి పంపిణీ ఏజెంట్లు / టోల్ ప్లాజాల వద్ద విక్రయ కేంద్రాలు / పీఓఎస్ అవుట్లెట్లలో ఏదైనా పాయింట్ ఆఫ్ సేల్ (పీఓ5) స్థానాలను వినియోగించుకోవచ్చు. అలాగే మీరు ఆన్లైన్లో ఫాస్టాగ్ కొనుగోలు చేయాలనుకుంటే, జారీ చేసిన బ్యాంక్ వెబ్సైట్లో ఆన్లైన్లో దరఖాస్తు చేయవచ్చు. అదెలాగో ఇప్పుడు చూద్దాం..

  • మీరు ఎంచుకున్న బ్యాంకు వెబ్ సైట్లోకి వెళ్లి ‘గెట్ ఫాస్ట్ ట్యాగ్’ లేదా ‘ఫాస్ట్ ట్యాగ్ కోసం దరఖాస్తు చేసుకోండి’ లింక్ ని కనుగొని, దానిపై క్లిక్ చేయండి.

  • మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ ని అందించండి. అవసరమైతే ఓటీపీని నమోదు చేయండి.

  • ప్రాంప్ట్ చేసినప్పుడు మీ పూర్తి పేరు, ఈమెయిల్ ఐడీ, ప్రస్తుత చిరునామా, వాహన సమాచారం, వాహనం రకం, రిజిస్ట్రేషన్ నంబర్ వంటి మీ వ్యక్తిగత సమాచారాన్ని నమోదు చేయండి.

  • మీరు మీ వాహనం ఆర్సీ (రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్) స్కాన్ చేసిన కాపీని కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది.

  • అవసరమైన రుసుములను సమర్పించడానికి మీరు ఆన్లైన్ చెల్లింపు గేట్ వేకి వెళ్తారు. ఇది పూర్తయిన తర్వాత, ఫాస్ట్ ట్యాగ్ రసీదు, చెల్లింపు రసీదు కాపీని సేకరించండి.

  • అలాగే మీరు http://www.nhai.gov.in/# వెబ్ సైట్ నుంచి కూడా కొనుగోలు చేయొచ్చు. అక్కడ సూచించిన విధంగా అనుసరిస్తే సరిపోతుంది.

 
 
bottom of page