సన్నీ డియోల్ విల్లా వేలం నోటీసులను వెనక్కి తీసుకున్న బ్యాంకు.. 💰💼
- Suresh D
- Aug 21, 2023
- 1 min read
బ్యాంక్ ఆఫ్ బరోడా నుండి సన్నీ డియోల్ గత ఏడాది రూ.55.99 కోట్ల లోను తీసుకున్నాడు. ఇప్పటివరకు దానికి సంబంధించిన వడ్డీ చెల్లించలేదు. అంతే కాకుండా ఆయనకు ఎన్ని నోటీసులు పంపినా కూడా సమాధానం లేదు. దాంతో చేసేది లేక బ్యాంక్ వారు సన్నీ డియోల్ తనకా పెట్టిన ఆస్తిని వేలం వేసి రికవరీ చేసుకోవాలని భావించారు.

బ్యాంక్ ఆఫ్ బరోడా నుండి సన్నీ డియోల్ గత ఏడాది రూ.55.99 కోట్ల లోను తీసుకున్నాడు. ఇప్పటివరకు దానికి సంబంధించిన వడ్డీ చెల్లించలేదు. అంతే కాకుండా ఆయనకు ఎన్ని నోటీసులు పంపినా కూడా సమాధానం లేదు. దాంతో చేసేది లేక బ్యాంక్ వారు సన్నీ డియోల్ తనకా పెట్టిన ఆస్తిని వేలం వేసి రికవరీ చేసుకోవాలని భావించారు. ఈ వేలం ద్వారా సన్నీ డియోల్ తనకా పెట్టిన ఆస్తిని రూ.51.43 కోట్లకు అమ్మేయాలని బ్యాంక్ నిర్ణయించింది. ఆ ఆస్తిని వేలం వేసిన కూడా అంత మొత్తం వస్తుందా అనేది అనుమానంగా ఉంది. ఇంతలోనే సన్నీ డియోల్ నటించిన గదర్ 2 సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఆ కారణంగా సన్నీ డియోల్ క్రేజ్ అమాంతం పెరిగింది. అంతే కాకుండా ఆయనకు ఇకపై వరుసగా సినిమాల్లో నటించే అవకాశాలు వస్తాయి. ఇటీవలే సన్నీ డియోల్ సూపర్ హిట్ మూవీ సీక్వెల్ కు సంబంధించిన చర్చలు జరుగుతున్నాయి. దాంతో బ్యాంకు కు ఆయన చెల్లించాల్సిన మొత్తంను చెల్లించే అవకాశాలు ఉన్నాయి. కనుక ఆస్తిని వేలం వేయాలి అనే నిర్ణయాన్ని ఉపసంహరించుకున్నట్లుగా తెలుస్తోంది. 💸🏦











































