2.పవన్ కళ్యాణ్ బర్త్ డే సందర్భంగా 'హరిహర వీరమల్లు' పోస్టర్ విడుదల..🎥💫
- Suresh D
- Sep 2, 2023
- 1 min read
పవన్ బర్త్ డే సందర్భంగా ఆయన తాజా చిత్రం 'హరిహర వీరమల్లు' పోస్టర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. అర్ధరాత్రి 12.17 గంటలకు పోస్టర్ ను విడుదల చేశారు.

పవన్ బర్త్ డే సందర్భంగా ఆయన తాజా చిత్రం 'హరిహర వీరమల్లు' పోస్టర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. అర్ధరాత్రి 12.17 గంటలకు పోస్టర్ ను విడుదల చేశారు. క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్స్, గ్లింప్స్ కు ప్రేక్షకుల నుంచి భారీ రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్రంలో నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది. ఎన్నికల లోపు ఈ సినిమాను పవన్ పూర్తి చేస్తారని తెలుస్తోంది. మరోవైపు పోస్టర్ రిలీజ్ సందర్భంగా చిత్ర యూనిట్ పవన్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపింది. అసాధారణ ధైర్యసాహసాలు, దయ, అపరిమితమైన కరుణ కలిగిన పవన్ పుట్టినరోజును ఈ సంతోషకరమైన రోజున జరుపుకుంటున్నామని ట్వీట్ చేసింది. 🎥💫