‘ఓజీ’ గ్లింప్స్ అదిరిపోయింది..🎥💫
- Suresh D
- Sep 2, 2023
- 1 min read
పవన్ కళ్యాణ్ హీరోగా సాహో డైరెక్టర్ సుజిత్ దర్శకత్వం వహిస్తున్న సినిమా ఓజీ . ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా అప్డేట్స్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఎప్పుడెప్పుడు ఈ మూవీ నుంచి టీజర్ వస్తుందా అని వెయిట్ చేస్తున్న అభిమానులకు శుక్రవారం మేకర్స్ గుడ్ న్యూస్ చెప్పిన సంగతి తెలిసిందే. శనివారం పవన్ బర్త్ డే సందర్భంగా ఉదయం 10.35 గంటలకు టీజర్ లాంచ్ చేయనున్నట్లు వెల్లడించారు. ఇక ముందుగా చెప్పినట్లు తాజాగా ఓజీ గ్లిఫ్స్ రిలీజ్ చేస్తూ పవన్ అభిమానులకు స్పెషల్ ట్రీట్ ఇచ్చారు ఓజీ చిత్రయూనిట్.🎥💫