top of page

తాళి తప్ప ఇంకేమీ మిగల్లేదు..శ్రీహరి భార్య🎥🎞️

అట్టడుగు స్థాయి నుంచి తన ప్రయాణం ప్రారంభించిన నటుడు శ్రీహరి సినీ ప్రపంచంపై తనదైన ముద్ర వేశారు. తొలుత విలన్‌గా, ఆపై క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటన, కామెడీ టైమింగ్‌తో అభిమానులను విశేషంగా అలరించారు.

ree

అట్టడుగు స్థాయి నుంచి తన ప్రయాణం ప్రారంభించిన నటుడు శ్రీహరి సినీ ప్రపంచంపై తనదైన ముద్ర వేశారు. తొలుత విలన్‌గా, ఆపై క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటన, కామెడీ టైమింగ్‌తో అభిమానులను విశేషంగా అలరించారు. 2013లో నటుడు ప్రభు దేవాకు సంబంధించిన ఓ సినిమా షూటింగ్‌లో పాల్గొనేందుకు ముంబై వెళ్లిన ఆయన అక్కడ అకస్మాత్తుగా అనారోగ్యం పాలయ్యారు. ఆ తరువాత లీలావతీ ఆసుపత్రిలో చికిత్సపొందుతూ మృతి చెందారు. శ్రీహరి భార్య డిస్కో శాంతి తన భర్త మరణంపై గతంలో అనేక మార్లు సందేహాలు వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఆసుపత్రిపై కేసు వేయాలని కొందరు సలహాలు ఇచ్చినప్పటికీ పిల్లలతో తాను కోర్టుల చుట్టూ తిరగలేనని భావించి వెనకడుగు వేసినట్టు ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. శ్రీహరి మరణం తరువాత తమ ఆర్థిక స్థితి తలకిందులైందని, తాళి తప్ప ఇంకేమీ మిగల్లేదంటూ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. 🎥🎞️

 
 
bottom of page