top of page

సుశాంత్ జీవితంపై ఎవరు సినిమా తీయకూడదు..హీరో తండ్రి.🎥🎞️

సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ బయోపిక్ ‘న్యాయ్: ది జస్టిస్’ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ కావడాన్ని ఇప్పటికే ఆయన కుటుంబం వ్యతిరేకించింది. ఈ మూవీ స్ట్రీమింగ్ ఆపాలని సుశాంత్ ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించగా.. ఆ చిత్రాన్ని నిషేధించడానికి నిరాకరించింది కోర్టు. ఈ క్రమంలోనే ఇప్పుడు సుశాంత్ తండ్రి ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు.

ree

సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ బయోపిక్ ‘న్యాయ్: ది జస్టిస్’ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ కావడాన్ని ఇప్పటికే ఆయన కుటుంబం వ్యతిరేకించింది. ఈ మూవీ స్ట్రీమింగ్ ఆపాలని సుశాంత్ ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించగా.. ఆ చిత్రాన్ని నిషేధించడానికి నిరాకరించింది కోర్టు. ఈ క్రమంలోనే ఇప్పుడు సుశాంత్ తండ్రి ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ తండ్రి న్యాయవాది వరుణ్ సింగ్ కోర్టులో వాదించారు, ఈ చిత్రం నటుడి వ్యక్తిత్వ హక్కులను ఉల్లంఘించడమే కాకుండా, కుటుంబ సభ్యుల గోప్యతను కూడా ఉల్లంఘిస్తోందని, దానిని తాము ఒప్పుకోవడానికి సిద్ధంగా లేమని అన్నారు. మరోవైపు చిత్ర నిర్మాతల తరఫు న్యాయవాది మాట్లాడుతూ, ఒక వ్యక్తి మరణించిన తర్వాత గోప్యత హక్కును క్లెయిమ్ చేయలేమని అన్నారు.ఈ విషయం సబ్ జ్యూడీస్‌గా ఉందని, అప్పీల్‌పై ప్రతి ఒక్కరూ తమ సమాధానాన్ని దాఖలు చేయాలని కోర్టు కోరింది. సుశాంత్‌పై చాలా మంది అనుమతిలేకుండా సినిమాలు, వెబ్ సిరీస్‌లు, పుస్తకాలు రాస్తున్నారని సుశాంత్ తండ్రి ఆరోపించారు. ఇలా చేయడం వలన తన కుమారుడి పరువు, అతని ప్రైవసీ, హక్కులకు విరుద్ధమని సుశాంత్ తండ్రి ఆవేదన వ్యక్తం చేశారు.🎥🎞️


 
 
bottom of page