మెగా హీరో చిత్రం విడుదల వాయిదా..🎥🎞️
- Suresh D
- Aug 19, 2023
- 1 min read
మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్, యువనటి శ్రీలీల జంటగా తెరకెక్కుతున్న చిత్రం ‘ఆదికేశవ’. శ్రీకాంత్ ఎన్.రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ సంస్థలు నిర్మిస్తున్నాయి. ఈ సినిమా ఆగస్టు 18న విడుదల కావాల్సి ఉంది. కానీ, షూటింగ్ పూర్తవకపోవడంతో విడుదల వాయిదా పడింది. చిత్రాన్ని నవంబర్ 10వ తేదీన విడుదల చేస్తున్నట్టు చిత్ర బృందం ప్రకటించింది.🎥🎞️
