మంచు విష్ణు 'కన్నప్ప' ప్రాజెక్టు ప్రారంభం🎥💫
- Suresh D
- Aug 18, 2023
- 1 min read
టాలీవుడ్ హీరో మంచు విష్ణు తన కలల ప్రాజెక్టు 'కన్నప్ప' ను పట్టాలెక్కించారు. కన్నప్ప చిత్రం ఇవాళ హైదరాబాద్ లో ప్రారంభమైంది. ఈ చిత్రానికి మోహన్ బాబు నిర్మాత కాగా, ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో మంచు విష్ణు సరసన నుపుర్ సనన్ కథానాయికగా నటిస్తోంది. అవా ఎంటర్టైన్మెంట్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్లపై రూపుదిద్దుకోనున్న ఈ ఎపిక్ మూవీపై చిత్రబృందం పూర్తి విశ్వాసంతో ఉంది. గతంలో కృష్ణంరాజు హీరోగా వచ్చిన 'భక్త కన్నప్ప' ఎంత పెద్ద హిట్టో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పుడు తాజా హంగులతో మంచు విష్ణు నటిస్తున్న 'కన్నప్ప' చిత్రానికి రూ.150 కోట్ల బడ్జెట్ అని తెలుస్తోంది. ఇతర వివరాలు త్వరలో ప్రకటించనున్నారు.💫
