top of page

వామ్మో.. వేగంగా వ్యాపిస్తున్న జోంబీ డీర్‌ డిసీజ్‌..! 😱 మరోసారి లాక్‌డౌన్‌ తప్పదా..? 😟

కరోనా మహమ్మారి శాంతించి ఏళ్ళు గడుస్తున్నప్పటికీ ఇంకా.. అనేక విధాలుగా రూపాంతరం చెందుతున్న వైరస్‌ వ్యాప్తి ప్రజలను టెన్షన్ పెడుతూనే ఉంది. 😷 మరీ ముఖ్యంగా కరోనా మహమ్మారి ఇలా ప్రపంచానికి చుక్కలు చూపెడితే.. ఇప్పుడు మరో వైరస్ మానవాళిని భయపెడుతోంది.


కరోనా మహమ్మారి శాంతించి ఏళ్ళు గడుస్తున్నప్పటికీ ఇంకా.. అనేక విధాలుగా రూపాంతరం చెందుతున్న వైరస్‌ వ్యాప్తి ప్రజలను టెన్షన్ పెడుతూనే ఉంది. 😷 మరీ ముఖ్యంగా కరోనా మహమ్మారి ఇలా ప్రపంచానికి చుక్కలు చూపెడితే.. ఇప్పుడు మరో వైరస్ మానవాళిని భయపెడుతోంది. 😨 అదే ‘జోంబీ డీర్’వైరస్. 💀 ప్రస్తుతం జంతువులకు మాత్రమే పరిమితమైన ఈ వైరస్.. ప్రజలకు సోకడం మొదలైతే మాత్రం మనల్ని మనం రక్షించుకోవడం చాలా కష్టం అంటున్నారు శాస్త్రవేత్తలు. 🧑‍🔬 ఈ క్రమంలోనే కెనడా శాస్త్రవేత్తలు జోంబీ డీర్ డిసీజ్ అనే ప్రాణాంతక సంక్రమణ వ్యాప్తి గురించి ఆందోళన వ్యక్తం చేశారు. 😱 రాబోయే కాలంలో మనుషులు కూడా ఈ వ్యాధి బారిన పడే ప్రమాదం ఉందని వారు హెచ్చరిస్తున్నారు. 😷 ఈ వ్యాధి అసలు పేరు క్రానిక్ వేస్టింగ్ డిసీజ్. ఇది సోకిన ప్రతి జంతువును చంపే నాడీ సంబంధిత పరిస్థితి. 😟 ఈ వ్యాధి ప్రస్తుతం అమెరికాలో జింకలలో వేగంగా వ్యాపిస్తోంది. 🦠

నివేదికల ప్రకారం, బ్రిటిష్ కొలంబియా, కెనడాలో జోంబీ వైరస్‌ వ్యాప్తి పెరగకుండా నిరోధించడానికి ఒక వ్యూహాన్ని జారీ చేసింది. 🚫 ఈ వ్యాధికి సంబంధించిన రెండు కేసులు జనవరి చివరిలో ఇక్కడ నమోదయ్యాయి. 📅 అప్పటి నుంచి ఇక్కడి అధికారులు శరవేగంగా కసరత్తు చేస్తున్నారు. 🚨 రోడ్డుపై చంపిన ప్రతి జింక, దుప్పి, ఎల్క్ లేదా కారిబోలను పరీక్షించాలని అక్కడి ప్రభుత్వాలు ఆదేశాలు జారీ చేశాయి. 👩‍⚕️

జోంబీ వైరస్‌ మెదడు, ఇతర కణజాలాలలో పేరుకుపోయి శారీరక, ప్రవర్తనా మార్పులు, క్షీణత, చివరికి మరణానికి కారణమవుతుంది. 💔 ఇది ఒక జంతువు నుండి మరో జంతువుకు సంపర్కం ద్వారా లేదా పరోక్షంగా మలం, నేల, వృక్షసంపద వంటి పర్యావరణంలో వ్యాపిస్తుంది. 🌍 జంతువులు వాటి మేత లేదా పచ్చిక బయళ్లను మోసుకెళ్లే ప్రియాన్‌లతో కలుషితమైతే కూడా వైరస్‌ సోకే ప్రమాదం ఉంది. 🚷 ఒక జింకలో ఈ లక్షణాలు అభివృద్ధి చెందడానికి ఒక సంవత్సరం కాలం పట్టవచ్చు. 📆 జింక బరువును తీవ్రంగా కోల్పోవడం, మొత్తం శక్తిని కోల్పోయి చచ్చుబడిపోయినటుంటి లాంటి లక్షణాలు కనిపిస్తాయి. 💪

కెనడియన్ ఆరోగ్య అధికారులు ఈ వ్యాధి మానవులను ప్రభావితం చేస్తుందనడానికి ప్రత్యక్ష ఆధారాలు ఇంకా కనుగొనబడలేదని చెప్పారు.. కానీ, ఒక నివేదిక ప్రకారం, దీనిపై నిర్వహించిన పరిశోధనలో ప్రైమేట్‌ల మధ్య ఈ వ్యాధి సంక్రమించే అవకాశం ఉందని సూచించింది. 📊 మానవులు ప్రస్తుతం దీని నుండి సురక్షితంగా ఉన్నప్పటికీ, భవిష్యత్తులో వారు దీని బారిన పడే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. 🔍

 
 
bottom of page