మొదటి షెడ్యూల్ షూటింగ్ పూర్తి చేసుకున్న మోహన్ లాల్ 'వృషభ' మూవీ🎥🎞️
- Suresh D
- Aug 24, 2023
- 1 min read
మలయాళ స్టార్ మోహన్ లాల్, సీనియర్ హీరో శ్రీకాంత్ కొడుకు రోషన్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న తాజా చిత్రం 'వృషభ'. నందకిషోర్ దర్శకత్వంలో భారీ బడ్జెట్‌తో ఈ మూవీని నిర్మిస్తున్నారు.

మలయాళ స్టార్ మోహన్ లాల్, సీనియర్ హీరో శ్రీకాంత్ కొడుకు రోషన్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న తాజా చిత్రం 'వృషభ'. నందకిషోర్ దర్శకత్వంలో భారీ బడ్జెట్‌తో ఈ మూవీని నిర్మిస్తున్నారు. రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నట్లు తెలుస్తోంది. సినిమాలో రోషన్ సరసన షనాయ కపూర్ హీరోయిన్ గా నటిస్తుండగా.. శ్రీకాంత్, కన్నడ నటి రాగిణి ద్వివేది, ఒకప్పటి హిందీ నటి సల్మా కుమార్తె జహ్రా ఎస్ ఖాన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.ఈ చిత్ర యూనిట్ తాజాగా ఫస్ట్ షెడ్యూల్ ని కంప్లీట్ చేసింది. ఇదే విషయాన్ని తెలియజేస్తూ మోహన్ లాల్ సోషల్ మీడియా వేదికగా పలు ఫోటోలను పంచుకున్నారు. అందులో మోహన్ లాల్ కత్తి దూస్తున్న ఫోటో ఆకట్టుకుంటుంది. దీన్నిబట్టి సినిమాలో మోహన్‌లాల్ ఓ చారిత్రాత్మక నేపథ్యం ఉన్న పాత్రలో నటిస్తున్నట్లు తెలుస్తోంది. మైసూర్ షెడ్యూల్లో ప్రముఖ స్టంట్ మాస్టర్ పీటర్ హెయిర్ ఆధ్వర్యంలో భారీ యాక్షన్ ఘట్టాలను చిత్రీకరించినట్లు సమాచారం. 🎥🎞️