'కింగ్ ఆఫ్ కొత్త' మూవీ రివ్యూ🎥🎞️
- Suresh D
- Aug 24, 2023
- 1 min read
కింగ్ ఆఫ్ కొత్త అనేది 80, 90వ దశకంలో జరుగుతుంది. కొత్త అంటే అదేదో కొత్త అని అనుకుంటే పొరబాటే. మళయాలంలో కొత్త అంటే ఊరు లేదా పట్టణం అని అర్థమట. అందుకే తెలుగులోనూ అదే టైటిల్‌ను పెట్టారు. కానీ సినిమాలో మాత్రం ప్రతీ సారి కోతా అని వినిపిస్తుంటుంది. ఇక అది పక్కన పెడితే.. కింగ్ ఆఫ్ కొత్త అనేది ఏమంత కొత్తగా అనిపించదు.

కింగ్ ఆఫ్ కొత్త అనేది 80, 90వ దశకంలో జరుగుతుంది. కొత్త అంటే అదేదో కొత్త అని అనుకుంటే పొరబాటే. మళయాలంలో కొత్త అంటే ఊరు లేదా పట్టణం అని అర్థమట. అందుకే తెలుగులోనూ అదే టైటిల్‌ను పెట్టారు. కానీ సినిమాలో మాత్రం ప్రతీ సారి కోతా అని వినిపిస్తుంటుంది. ఇక అది పక్కన పెడితే.. కింగ్ ఆఫ్ కొత్త అనేది ఏమంత కొత్తగా అనిపించదు. మనం ఇది వరకు ఎన్నో చిత్రాలు చూసిన ఫీలింగే కలుగుతుంది. ప్రాణ స్నేహితుల మధ్య శత్రుత్వం, మోసాలు మీద ఎన్నో కథలు వచ్చాయి. ప్రేమ, స్నేహం ముసుగులో హీరోకు వెన్నుపోట్లు జరుగుతుంటాయి. ఇలాంటి సీన్లు ఇది వరకు చూసిన ఫీలింగ్ కలుగుతుంది. అయితే హీరో హీరోయిన్ ట్రాక్ కాస్త కొత్తగా అనిపిస్తుంది.🎥🎞️
సెకండాఫ్‌లో ట్విస్టుల మీద ట్విస్టులు ఉంటాయి. అవి చిన్న చిన్నవే అయినా అరెరె బాగుందే అనే ఫీలింగ్ ఇస్తాయి. ఇక ఈ సినిమా ఎన్నో సీన్లను ఇంకెంతో బాగా చూపించి ప్రేక్షకుడికి హై ఫీలింగ్ ఇవ్వొచ్చనిపిస్తుంది. కానీ ప్రేక్షకుడికి ఆసక్తి కలిగే లోపు వాటి మీద నీళ్లు చల్లినట్టు అనిపిస్తుంది. ఫస్ట్ హాఫ్‌లో అలా నీరుగార్చే సీన్లు చాలానే ఉండటంతో ప్రేక్షకుడికి బోర్ కొడుతుంది. సరైన సీన్ ఒక్కటి కూడా పడలేదేంటి? అనే ఫీలింగ్‌లోనే ప్రేక్షకుడు ఉంటాడు.క్లైమాక్స్ వరకు బాగానే సాగదీసినట్టుగా అనిపిస్తుంది. సినిమా లెంగ్త్ కాస్త తగ్గిస్తే కథనంలో ఇంకా వేగం పెరిగేదనిపిస్తుంది. మాటలు కొన్ని చోట్ల మెప్పిస్తాయి. ఉన్న ఒకటి రెండు పాటలు ఓకే అనిపిస్తాయి. నిర్మాణ విలువలు గొప్పగా ఉన్నాయి.అసలు ఎటువంటి అంచనాలు పెట్టుకోకుండా వెళితే యాక్షన్ ప్రేమికులు 'కింగ్ ఆఫ్ కొత్త' ను ఓసారి చూడొచ్చు. అదీ దుల్కర్ సల్మాన్ నటన, యాక్షన్ బ్లాక్స్ & జేక్స్ బిజోయ్ నేపథ్య సంగీతం కోసం! లేదంటే కష్టమే!🎥🎞️